Hyderabad: చిక్కడపల్లిలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2023-02-02T08:09:23+05:30 IST

చిక్కడపల్లి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వి ఎస్టి‎లోని అన్నపూర్ణ బార్ సమీపంలోనీ ఓ గోదాంలో

Hyderabad: చిక్కడపల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: చిక్కడపల్లి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వి ఎస్టి‎లోని అన్నపూర్ణ బార్ సమీపంలోనీ ఓ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించడంతో స్థానికులు ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గోదాంలో ఓ కంపెనీకి చెందిన కేబుల్ వైర్లు, ప్లాస్టిక్ మెటీరియల్‎కు అంటుకోవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-02T08:09:28+05:30 IST