ఎయిర్‌పోర్టు మెట్రోకు 500 కోట్లే!

ABN , First Publish Date - 2023-02-07T04:31:33+05:30 IST

నిర్వహణ పనులకు ఎక్కువ కేటాయింపులు.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పనులకు అత్తెసరు నిధులు.. గొప్పగా చెప్పుకొంటున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌పై బడ్జెట్‌లో ప్రభుత్వం తీరిది.

ఎయిర్‌పోర్టు మెట్రోకు 500 కోట్లే!

రూ.6,250 కోట్ల ప్రాజెక్టుకు కేటాయింపులు 8 శాతమే

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): నిర్వహణ పనులకు ఎక్కువ కేటాయింపులు.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పనులకు అత్తెసరు నిధులు.. గొప్పగా చెప్పుకొంటున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌పై బడ్జెట్‌లో ప్రభుత్వం తీరిది. ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ కనెక్టివిటీకి రూ.500 కోట్లే (8 శాతం) ఇవ్వడం దీనికి ఉదాహరణ. మెట్రో రెండో దశలో మైండ్‌స్పేస్‌ జంక్షన్‌- శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (31 కి.మీ.), బీహెచ్‌ఈఎల్‌- లక్డీకపూల్‌ (26 కి.మీ.), నాగోలు-ఎల్‌బీనగర్‌ (5 కి.మీ.) మార్గానికి నాలుగేళ్ల క్రితం డీపీఆర్‌ రూపొందించారు. నిధుల కోసం పలుసార్లు కేంద్రాన్ని కోరినా స్పందన లేకపోవడంతో ఎయిర్‌పోర్టు కారిడార్‌ను సొంతంగా చేపట్టేందుకు రాష్ట్రం ముందుకొచ్చింది. రూ6,250 కోట్ల అంచనాతో డిసెంబరు 9న సీఎం కేసీఆర్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్‌ను మూడేళ్లలో పూర్తి చేస్తామంటూ బడ్జెట్‌లో ఆ స్థాయిలో కేటాయింపులు ఇవ్వకపోవడం గమనార్హం. రూ.500 కోట్లతో సర్వే కూడా కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక బీహెచ్‌ఈఎల్‌-లక్డీకపూల్‌, నాగోలు-ఎల్‌బీనగర్‌ మార్గాన్ని పొడిగింపును బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం.

పాతనగరానికి మళ్లీ రూ.500 కోట్లు

ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గానికి గత బడ్జెట్‌లోలానే రూ.500 కోట్లు ఇచ్చారు. నిరుడు రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పెరిగిన ధరల రీత్యా రూ.500 కోట్లతో రెండు కి.మీ. కూడా పూర్తిచేయలేని పరిస్థితి ఉంటుందని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఫ ఎంఎంటీఎ్‌సకు ప్రభుత్వం బడ్జెట్‌లో మొక్కుబడిగా నిధులు కేటాయించింది. తన వాటా కింద చెల్లించాల్సినదాంట్లో కేవలం రూ.50 కోట్లు ఇచ్చింది. గత బడ్జెట్‌లోనూ ఇంతే మొత్తం ఇచ్చింది. రూ.817 కోట్ల అంచనాతో 96 కి.మీ. మేర విద్యుద్దీకరణ, కొత్త లైన్లు, డబ్లింగ్‌ పనులకు రెండు వంతుల నిధులు కేంద్రం, మూడు వంతులు రాష్ట్రం ఇవ్వాలనేది ఒప్పందం. కేంద్రం వాటా రూ.217 కోట్లకు రెట్టింపు ఇవ్వగా.. రాష్ట్రం 2012 నుంచి రూ.279 కోట్లు ఇచ్చింది.

Updated Date - 2023-02-07T04:31:34+05:30 IST