Hyderabad: మహాశివరాత్రికి శ్రీశైలానికి 390 ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2023-02-07T07:15:18+05:30 IST

మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలానికి జంటనగరాల నుంచి 390 ప్రత్యేక బస్సులను

Hyderabad: మహాశివరాత్రికి శ్రీశైలానికి 390 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌: మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలానికి జంటనగరాల నుంచి 390 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ తెలిపారు. ఈనెల 16 నుంచి 19 వరకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌, జూబ్లీబస్‌స్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌, ఐఎస్‌ సదన్‌, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈల్‌ పాయింట్లతో పాటు నగరంలోని పలు ఇతర ప్రారతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన వివరించారు. 16న 36 ప్రత్యేక బస్సులు, 17న 99, 18న 99, 19న 88 బస్సులు నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. మిగతా 68 బస్సులు ఇతర ప్రాంతాల నుంచి నడపనున్నట్టు తెలిపారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి శ్రీశైలానికి సూపర్‌ లగ్జరీలో ఒకరికి రూ.600, డీలక్స్‌లో రూ.540, ఎక్స్‌ప్రె్‌సలో రూ.460, నగరంలోని ఇత ర ప్రాంతాల నుంచి సూపర్‌ లగ్జరీలో ఒకరికి రూ.650, డీలక్స్‌లో రూ.580, ఎక్స్‌ప్రె్‌స్‌లో రూ.500 వసూలు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించామని, ఇతర వివరాల కోసం ఎంజీబీఎస్‌లో 99592 26250, 9959226248, 9959226257 ఫోన్‌ నెంబర్లలో, జేబీఎస్‌లో 9959226246, 040-27802203, ఐఎస్‌సదన్‌లో 9959226250, బీహెచ్‌ఈల్‌, కేపీహెచ్‌బీ పాయింట్లలో 9959226149 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించవచ్చు.

Updated Date - 2023-02-07T07:15:20+05:30 IST