చదువుకు 19వేల కోట్లు

ABN , First Publish Date - 2023-02-07T04:34:25+05:30 IST

ద్యారంగానికి గతేడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్‌ కేటాయింపులు రూ.3,051 కోట్లు పెరిగాయి. సోమవారం బడ్జెట్‌లో విద్యారంగానికి మొత్తంగా రూ.19,093 కోట్లు కేటాయించారు.

చదువుకు 19వేల కోట్లు

గతేడాది కంటే 3 వేల కోట్లు అధికం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): విద్యారంగానికి గతేడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్‌ కేటాయింపులు రూ.3,051 కోట్లు పెరిగాయి. సోమవారం బడ్జెట్‌లో విద్యారంగానికి మొత్తంగా రూ.19,093 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో ఇది 6.57ు. ఇందులో రూ.16,092 కోట్లను పాఠశాల విద్యకు, రూ.3,001 కోట్లు ఉన్నత విద్యకు కేటాయించారు. అయితే, ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ బడులను రూ.7,289 కోట్లతో అభివృద్ధి చేయడానికి మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటి దశ కింద 9,123 బడులను ఎంపిక చేశారు. ఇందుకు రూ.3,497 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది గడుస్తున్నా.. ఇంకా తొలి దశ పనులే పూర్తి కాలేదు. తాజాగా, ఈ కార్యక్రమానికి నిధుల కేటాయింపుపై బడ్జెట్‌లోనూ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, యూనివర్సిటీల్లో భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా రూ.500 కోట్లు కేటాయించారు. అయితే, వర్సిటీల అభివృద్ధికి ఈ నిధులు సరిపోవని, కనీసం రూ.2వేల కోట్లు కావాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - 2023-02-07T04:34:27+05:30 IST