Hyderabad: కమిషనరేట్ పరిధిలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

ABN , First Publish Date - 2023-01-25T17:26:40+05:30 IST

హైదరాబాద్ కమిషనరేట్ (Hyderabad Commissionerate) పరిధిలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.

Hyderabad: కమిషనరేట్ పరిధిలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ కమిషనరేట్ (Hyderabad Commissionerate) పరిధిలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. రాజ్‌భవన్‌లో (Raj Bhavan) రేపు గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం జరగనుంది. రాజ్‌భవన్‌కు ఇరువైపులా రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ మళ్లిస్తామని పోలీసులు చెప్పారు. సోమాజిగూడ జంక్షన్ నుంచి వీవీ స్టాచ్యూ జంక్షన్ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2023-01-25T17:28:26+05:30 IST