గోపలాయపల్లిలో ఘనంగా గరుడసేవ

ABN , First Publish Date - 2023-02-07T00:37:33+05:30 IST

మండలంలోని హరిహరక్షేత్రం గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయం త్రం గరుడసేవ నిర్వహించారు.

గోపలాయపల్లిలో ఘనంగా గరుడసేవ
గరుడసేవ నిర్వహిస్తున్న అర్చకులు

గోపలాయపల్లిలో ఘనంగా గరుడసేవ

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 6: మండలంలోని హరిహరక్షేత్రం గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయం త్రం గరుడసేవ నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన గరుడవాహనంపై రుక్మిణి సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి అర్చక స్వాముల మంత్రోచ్చారణలు, సన్నాయి వాయిద్యాల మధ్య కొండపై ఊరేగించారు. కార్యక్రమంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త కోమటిరెడ్డి మోహనరెడ్డి, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:37:34+05:30 IST