ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ వసతులు

ABN , First Publish Date - 2023-02-02T00:47:09+05:30 IST

‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి వసతులు, విద్య అందుబాటులోకి వస్తున్నాయని ఎమ్మె ల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. రూ.18.50లక్షల నిధులతో అభివృద్ధి చేసిన భువనగిరి గాంధీనగర్‌ ప్రభుత్వ యూపీఎస్‌ నెంబర్‌.2 పాఠశాలను బుధవారం ప్రారంభిం చి మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ వసతులు

మన ఊరు-మన బడితోనే సాధ్యం

ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి

భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి 1: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి వసతులు, విద్య అందుబాటులోకి వస్తున్నాయని ఎమ్మె ల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. రూ.18.50లక్షల నిధులతో అభివృద్ధి చేసిన భువనగిరి గాంధీనగర్‌ ప్రభుత్వ యూపీఎస్‌ నెంబర్‌.2 పాఠశాలను బుధవారం ప్రారంభిం చి మాట్లాడారు. పేద విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చేందుకు పాఠశాల స్థాయిలోనే నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. ఆధునికీకరించిన పాఠశాల భవనాలు, అందనున్న కంప్యూటర్‌, నాణ్యమైన విద్యతో విద్యార్థుల ప్రవేశాలు కూడా పెరుగుతాయన్నారు. అలాగే భువనగిరి మునిసిపాలిటీ, కెనరా బ్యాంక్‌ సమకూర్చిన రూ.2లక్షలతో రూపొందించిన లైబ్రరీ, డిజిటల్‌ క్లాస్‌ రూంను కూడా ప్రారంభించారు. రూ.2కోట్లతో అభివృద్ధి చేసిన 34 పాఠశాలలను మరో 10 రోజుల్లో ప్రారంభించనున్నట్లు డీఈవో డాక్టర్‌ కె.నారాయణరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, కౌన్సిలర్లు పంగ రెక్క స్వామి, వడిశర్మ లక్ష్మీ, హేమలత, మునిసిపల్‌ కమిషనర్‌ బి.నాగిరెడ్డి, జిల్లా సెక్టోరియల్‌ అధికారి ఆండాలు, ఎంఈవో నాగవర్థన్‌రెడ్డి, హెచ్‌ఎం శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:47:11+05:30 IST