బీఎన్‌తిమ్మాపూర్‌ ప్రజలకు రుణపడి ఉంటా

ABN , First Publish Date - 2023-02-02T00:40:59+05:30 IST

కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీఎన్‌తిమ్మాపూర్‌ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు. ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు భువనగిరి శివారులోని హుస్సేనాబాద్‌ సర్వే నెం.107లో 94ఎకరాల విస్తీర్ణంలో రూ.35కోట్లతో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో 1,048 మందికి బుధవారం కలెక్టర్‌ పమేలాసత్పథి ముంపు నిర్వాసితుల సమక్షంలో లాటరీ పద్ధతిన ఒక్కొక్కరికి 200 గజాల ప్లాట్లను కేటాయించారు.

బీఎన్‌తిమ్మాపూర్‌ ప్రజలకు రుణపడి ఉంటా

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

భువనగిరి రూరల్‌, ఫిబ్రవరి1: కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీఎన్‌తిమ్మాపూర్‌ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు. ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు భువనగిరి శివారులోని హుస్సేనాబాద్‌ సర్వే నెం.107లో 94ఎకరాల విస్తీర్ణంలో రూ.35కోట్లతో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో 1,048 మందికి బుధవారం కలెక్టర్‌ పమేలాసత్పథి ముంపు నిర్వాసితుల సమక్షంలో లాటరీ పద్ధతిన ఒక్కొక్కరికి 200 గజాల ప్లాట్లను కేటాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బస్వాపూర్‌ రిజర్వాయర్‌తో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమవుతుందని, బీఎన్‌తిమ్మాపూర్‌ ప్రజల త్యాగాలు ఎప్పటికీ మరువలేమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి, ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ కొప్పుల వెంకట్‌రెడ్డి, పీఆర్‌ డిప్యూటీ ఈఈ కె.గిరిధర్‌, ఏఈ ప్రసాద్‌, గ్రంథాలయ చైర్మన్‌ డాక్టర్‌ అమరేందర్‌, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ కొలుపుల అమరేందర్‌, ఏఎంసీ, పీఏసీఎస్‌ చైర్మన్లు ఎడ్ల రాజేందర్‌రెడ్డి, నోముల పరమేశ్వర్‌ రెడ్డి, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, సర్పంచ్‌ పిన్నం లత, ఎంపీటీసీ ఉడుత శారద, ఉప సర్పంచ్‌ ఎడ్ల దర్శన్‌ రెడ్డి, కౌన్సిలర్‌ గుండెగల్ల అంజమ్మ, ఆర్‌ఐలు జె.భద్రయ్య, ఎస్‌కె.సైదా పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాకే ప్లాట్లు కేటాయించాలి

పరిహారం అందజేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.10లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించాకే ఇళ్ల ప్లాట్లను తీసుకుంటామని గ్రామస్థులు పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్సేనాబాద్‌ శివారులో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ప్రభుత్వం ప్లాట్లను పంపిణీ చేస్తుందని తెలిపేందుకు బుధవారం పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. దీంతో కొంతమంది గ్రామస్థులు తమ సమస్యలు పరిష్కరించాకే ప్లాట్లను తీసుకుంటామని ఎంపీటీసీ భర్త ఉడుత ఆంజనేయులు, ఉప సర్పంచ్‌ ఎడ్ల దర్శన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ భర్త రావుల నందు, విద్యా కమిటీ చైర్మన్‌ ఉడుత మహేందర్‌ను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. కాగా సర్పంచ్‌ పిన్నం లతరాజు ఆధ్వర్యంలో కొంతమంది గ్రామస్థులు ఉదయం 11గంటలకు ప్లాట్ల కేటాయింపు కార్యక్రమానికి హాజరయ్యారు.

Updated Date - 2023-02-02T00:41:00+05:30 IST