మేళ్లచెర్వు జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2023-01-25T01:00:41+05:30 IST

మేళ్ళచెర్వు మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని, తెల్లవార్లు విజయవంతంగా జరిగేలా సహకరించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ఈవో కొండారెడ్డి అధ్యక్షతన మహాశివరాత్రి ఉత్సవాల సందర్భం గా వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ మోహన్‌రావుతో కలిసి పాల్గొని మాట్లాడారు.

మేళ్లచెర్వు జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి

మేళ్ళచెర్వు, జనవరి 24: మేళ్ళచెర్వు మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని, తెల్లవార్లు విజయవంతంగా జరిగేలా సహకరించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ఈవో కొండారెడ్డి అధ్యక్షతన మహాశివరాత్రి ఉత్సవాల సందర్భం గా వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ మోహన్‌రావుతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఫిబ్రవరి 18న మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసే ప్రభలపై సాంస్కృతిక కార్యక్రమాలను తెల్లవారుజామున 4గంటల వరకు అనుమతించాలన్నా రు. ఎవరి ప్రభకు వారే రక్షణ కల్పించుకోవాలన్నారు. మహాశివరాత్రి తెలంగాణ మహాకుంభమేళాను తలపిస్తుందని, శివరాత్రి ఒక్కరోజే లక్షల మంది భక్తులు వస్తారని, అంతమందికి ఎలాంటి ప్రమాదం కానీ, అసౌకర్యం గానీ జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గతంలో జరిగిన చిన్నచిన్న పొరపాట్లను సరిచూసుకోవాలని, ఈసారి మరింత జాగ్రత్తగా జాతర నిర్వహించాలన్నారు. ఈ నెల 23న సీఎం కే సీఆర్‌ను కలిసి జాతర గురించి వివరించినట్లు చెప్పారు. వెంటనే మంగళవారం ఎస్డీఎఫ్‌ నిధుల నుంచి ఆలయ అభివృద్ధికోసం రూ.50లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసే ఎద్దుల పందేల్లో రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు మరే రాష్ట్రంలో లేని విధంగా రెండు ట్రాక్టర్లు, రెండు బుల్లెట్‌ బైకులతో పాటు రూ.కోటి బహుమతులను పశుపోషకులకు అందిస్తున్నామన్నారు. గ్రామపంచాయ తీ కార్యదర్శి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆరు మండలాల నుంచి 600 మంది పారిశుధ్య కార్మికులను మహాశివరాత్రి జాతర ఐదురోజులు అందుబాటులో ఉంచుతామన్నారు. 60 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పా టు చేశామన్నారు. ఆర్టీసీ అధికారులు హుజూర్‌నగర్‌, కోదాడ నుంచి ఆలయం వరకు నిరంతరం 35 బస్సులు నడుపుతారని చెప్పారు. రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నెస్పీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఐదు రోజులపాటు పూర్తిస్థాయిలో చింత్రియాల మేజర్‌ ద్వారా నీటిని విడుదల చేస్తామన్నారని తెలిపారు. సీఐ నాగదుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ ఫిబ్రవరి 15 నుంచి ఒక డిఎస్పీ, 10మంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు, 500 మంది కానిస్టేబుళ్లతో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తామన్నారు. గ్రామం చుట్టూ ఎనిమిది పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. మైహోం పరిశ్రమ ప్రతినిధి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నెస్పీ కాల్వపై రెండు తాత్కాలిక బ్రిడ్జీలు ఏర్పాటు చేస్తామని, భక్తులకు తాగునీరు, అత్యవసర సమయంలో ఫైరింజన్లు అందుబాటులో ఉంటాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీచేసి పరిసరాల పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ మహేంద్రకుమార్‌, తహసీల్దార్‌ దామోదర్‌రావు, ఎంపీడీవో ఇసాక్‌ హుస్సేన్‌, మండల వైద్యాధికారి ప్రేమ్‌సింగ్‌ , సర్పంచ్‌ శంకర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ ఇమ్రాన్‌, పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T01:00:45+05:30 IST