విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2023-01-24T22:29:00+05:30 IST

విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన అవసరమని చెన్నూరు సివిల్‌ కోర్టు జడ్జి సీహెచ్‌ సంపత్‌కుమార్‌ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మోడల్‌ స్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

కోటపల్లి, జనవరి 24: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన అవసరమని చెన్నూరు సివిల్‌ కోర్టు జడ్జి సీహెచ్‌ సంపత్‌కుమార్‌ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మోడల్‌ స్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో రాణించా లని, బాగా చదివి ఉన్నత ఉద్యోగాలు పొందాలన్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. చదు వుల్లో రాణిస్తున్న పలువురు విద్యార్థులను అభినందించారు. మోడల్‌ స్కూల్‌ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన ఆయన భోజనం, వసతులు, సౌకర్యాలను పరిశీలిం చారు. ఎస్‌ఐ వెంకట్‌, ప్రిన్సిపాల్‌ లక్ష్మారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ రాంబాబు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఏసీసీ: బాలికల హక్కులను సంరక్షించాలని జిల్లా సంక్షే మాధికారి చిన్నయ్య అన్నారు. చైల్డ్‌ లైన్‌, డీసీపీయూ ఆధ్వ ర్యంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. బాలల హక్కులు, చట్టాలు, ఆడపిల్లల సాధికారత, వివక్షతను ఎదు ర్కోవడం అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినులు పలు అంశాలపై పాటలు పాడారు. బాలికలను రక్షిద్దాం, బాలికలను చదివిద్దాం అనే ప్రతిజ్ఞ చేశారు. జిల్లా గిరిజనా భివృద్ది అధికారి నీలిమ, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అధికారులు స్వరూపారాణి, హేమసత్య, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆనంద్‌, చైల్డ్‌ హెల్పెలైన్‌ జిల్లా సమన్వయ కర్త సత్యనారాయణ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సులోచన దేవి, ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T22:29:03+05:30 IST