ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-02-06T22:23:40+05:30 IST

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిష్కరించా లని కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. సోమ వారం కలెక్టర్‌ చాంబర్‌లో ట్రైనీ కలెక్టర్‌ గౌతమితో కలిసి ఆర్టీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు.

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిష్కరించా లని కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. సోమ వారం కలెక్టర్‌ చాంబర్‌లో ట్రైనీ కలెక్టర్‌ గౌతమితో కలిసి ఆర్టీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు. కాసిపేట మండలం కోమటిచేనుకు చెందిన రామటెంకి అనూష ఫిష్‌ఫాండ్‌ నిర్వహణకు రాయి తీ ఇప్పించాలని దరఖాస్తు అందజేసింది. జీవో నం బరు 64 ప్రకారం వేతనాలు చెల్లించాలని పార్ట్‌టైమ్‌ కార్మికులు ఆర్జీ సమర్పించారు. జైపూర్‌ మండలం రామారావుపేటకు చెందిన మోతె గౌరిదేవీ టేలా నిర్వహణకు స్థలాన్ని కేటాయించాలని ఆర్జీ అందజే సింది. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సంబం ధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు.

కలెక్టర్‌కు పలువురి శుభాకాంక్షలు

కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన బదావత్‌ సంతోష్‌ నాయక్‌కు కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం పలువురు అధికారులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా మైనార్టీ ఉద్యోగుల సంఘం నాయ కులు క్యాలెండర్‌ను అందజేశారు. జిల్లా అధ్యక్షుడు ముక్తుల్లాఖాన్‌, నాయకులు సయ్యద్‌ సాజిద్‌, యూ నస్‌, మజార్‌, ఎండీ సాధిక్‌, యాకూబ్‌ ఆలీ పాల్గొ న్నారు. తెలంగాణ జాగృతి నాయకులు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జాగృతి రాష్ట్ర అధ్య క్షుడు తిరుపతివర్మ, జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి ప్రేంరావు, సురేష్‌, రాజేశంగౌడ్‌ పాల్గొన్నారు.

డైరీ ఆవిష్కరణ

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ టీచర్స్‌ యూనియన్‌ డైరీ, క్యాలెండర్‌లను కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌నాయక్‌ విడుదల చేశారు. లంబాడీ హక్కుల పోరాట సం ఘం అధ్యక్షుడు బదావత్‌ ప్రకాష్‌నాయక్‌ మాట్లాడు తూ ఈ నెల 15న జరగనున్న సేవాలాల్‌ జయం తిని అధికారిక సెలవుదినంగా ప్రకటించాలన్నారు. దత్తు, రాజనర్సు, లక్ష్మణ్‌రావు, రాజేష్‌నాయక్‌, సత్య నారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T22:23:42+05:30 IST