‘కంటి వెలుగు’ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2023-01-24T22:26:39+05:30 IST

తాళ్ల గురజాల గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సం దర్శించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేప ట్టారన్నారు.

‘కంటి వెలుగు’ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

బెల్లంపల్లి రూరల్‌, జనవరి 24: తాళ్ల గురజాల గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సం దర్శించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేప ట్టారన్నారు. ప్రజలు కంటి సమస్యలతో బాధపడవద్దని పరీక్షలు నిర్వహించి అద్దాలు, మందులు పంపిణీ చేస్తున్నారని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల న్నారు. ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌, సర్పంచ్‌లు రంజితవెంకటేష్‌ గౌడ్‌, రాయమల్లు, అశోక్‌, ఎంపీటీసీ శకుంతలవెంకటేష్‌, డాక్టర్‌ అనీష్‌, పాల్గొన్నారు.

భీమిని: కంటి వెలుగు దేశానికే ఆదర్శమని ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. రైతువేదిక వద్ద ఏర్పా టు చేసిన శిబిరాన్ని ఆయన పరిశీలించారు. మల్లీడి లో ఇటీవల మృతిచెందిన గుర్రాల గిరి కుటుంబాన్ని పరామర్శించారు. వెంకటాపూర్‌లో కొండగుర్ల వెంకటేష్‌ నిర్వహించిన క్రికెట్‌ టొర్నమెంట్‌లో పాల్గొని విజేతలకు బహుమ తులు అందించారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోనగిరి నిరంజన్‌ గుప్తా, ఎంపీపీ రాజేశ్వరిలక్ష్మణ్‌, డీపీవో ఫణీందర్‌ రావు, వైద్యుడు కృష్ణ, ఎంపీవో సఫ్దార్‌ అలీ, ఏపీవో భాస్కర్‌ రావు పాల్గొన్నారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని అదనపు కలెక్టరు రాహుల్‌ పరిశీలించారు. శిబిరం వద్ద తాగునీరు, వసతులు కల్పించాలని, పరీక్షలు చేసుకున్న వారికి 25 రోజుల్లో ఇంటివద్దకే కళ్లజోడులను అందిస్తామన్నారు.

Updated Date - 2023-01-24T22:26:39+05:30 IST