కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరించాలి

ABN , First Publish Date - 2023-02-06T22:21:07+05:30 IST

ప్రజలకు అండగా కాంగ్రెస్‌ పార్టీ నిలుస్తుందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం తిలక్‌నగర్‌ లో హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడుతూ గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరించాలి

ఏసీసీ, ఫిబ్రవరి 6: ప్రజలకు అండగా కాంగ్రెస్‌ పార్టీ నిలుస్తుందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం తిలక్‌నగర్‌ లో హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడుతూ గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రెండు నెలల పాటు ఇంటింటికి వెళ్లి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని పరిష్క రించేందుకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. పీసీసీ అధికార ప్రతి నిధి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు నరేష్‌, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ మజీజ్‌, నాయకులు పూదరి తిరుపతి, మహేష్‌, సదానందం పాల్గొన్నారు.

బెల్లంపల్లి: రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. శాంతిఖని బస్తీలో పట్ట ణాధ్యక్షుడు కంకటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో హాత్‌సే హాత్‌ జోడో కార్యక్ర మాన్ని నిర్వహించారు. సురేఖ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. చిలుముల శంకర్‌, రొడ్డ శారద, బండి ప్రభాకర్‌, మల్లయ్య, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

నస్పూర్‌: సీసీసీ కార్నర్‌ వద్ద హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమాన్ని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. రాజీవ్‌గాంధీ, అం బేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఎగరవేశారు. 22వ వార్డులో ఇంటింటికి వెళ్లి పార్టీ విజయాలు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌ సాగర్‌రావు చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వేణు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T22:21:10+05:30 IST