గరం..గరం

ABN , First Publish Date - 2023-01-25T22:55:25+05:30 IST

మంచిర్యాల జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం ఆద్యంతం గరం గరంగా కొనసాగింది. సమస్యలపై సభ్యుల నిలదీతలు, వాగ్వాదాలతో అట్టుడికిపోయింది. జి

గరం..గరం
మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరి

- ఉన్నతాధికారులు హాజరు కాకపోవడంపై అభ్యంతరం

- సమన్వయంతో అభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్‌ వినతి

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 25: మంచిర్యాల జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం ఆద్యంతం గరం గరంగా కొనసాగింది. సమస్యలపై సభ్యుల నిలదీతలు, వాగ్వాదాలతో అట్టుడికిపోయింది. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌తో కలిసి కలెక్టర్‌ భారతి హోళికేరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు సమావేశంలో సమస్యలు ప్రస్తావించారు. లక్షెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య మాట్లాడుతూ గూడెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నుంచి నీరు రాకపోవడంతో మండలంలో రైతుల పంటలు ఎండిపోతు న్నాయని చెప్పారు. అధికారులకు చెప్పినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని వాపోయారు. సమావేశాలకు కిందిస్థాయి అధికారులను పంపుతూ జిల్లా అధికారులు రాకపోవడంపై పలువురు సభ్యులు అభ్యం తరం వ్యక్తం చేశారు. మండల సమావేశాలకు అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్‌ పాటించడం లేదని, అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని అన్నారు.

విద్యుత్‌ కోతలపై..

కన్నెపల్లి జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో ఇష్టం వచ్చినట్లు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని, దీంతో రైతులు పంటలు ఎండిపోయి నష్టపోతు న్నాయని చెప్పారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత అధికారి, జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌లు స్పందించి విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు వైకల్యం ఉన్నప్పటికీ వైద్యులు 15 నుంచి 25 వైకల్య శాతం వేయడం అన్యాయమని పలువురు ప్రస్తావించారు. డీఆర్‌డీవో శేషాద్రి మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. జిల్లా విద్యాధి కారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, మన ఊరు మన బడి కా ర్యక్రమం కొనసాగుతుందని, నిధులను కేటాయించి సౌక ర్యాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్‌ భారతి హోళికేరీ మాట్లాడుతూ జిల్లాలో 1,046 పా ఠశాలల్లో 1,15,540 మంది విద్యార్థులు విద్యనభ్య సిస్తున్నా రని అన్నారు. వీరందరికి మధ్యాహ్న భోజనం, ఇతర వసతులపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటు న్నామన్నా రు. మన ఊరు మన బడిలో 248 పాఠశాలలను ఎంపిక చేశామని అన్నారు. ఇందులో 233 గ్రౌండింగ్‌ జరిగాయన్నా రు. 2022-23విద్యా సంవత్సరానికి 53,887 మంది విద్యా ర్థులకు యూనిఫాంలు అందించేందుకు సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులను ఎంపిక చేసి దుస్తులను కుట్టేందుకు అనుమ తులు ఇచ్చారని అన్నారు. 53,380 మంది విద్యార్థులకు రెండు జతల దుస్తులు అందజేస్తామని అన్నారు. వయో జన విద్య కోసం డీఆర్‌పీలతో మండలాల్లో నిరక్షరాస్యులకు వంద శాతం అక్షరాస్యులుగా చేశావనిఇ అన్నారు. వేమన పల్లి జడ్పీటీసీ రుద్రభట్ల స్వర్ణలత, తాండూర్‌ జడ్పీటీసీ బానయ్య మాట్లాడుతూ డ్రైనేజీలు, పారిశుధ్య సమస్యలు పేరుకుపోయాయన్నారు. రోడ్ల మరమ్మత్తులకు కొత్త నిధులు మంజూరు చేయాలని , కాలనీల్లో రోడ్లను మెరుగు పర్చాలన్నారు. కాగా ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ టాబ్లాయిడ్‌లో విద్యుత్‌ బిల్లుల భారం పేరిట ట్రాన్స్‌కో వసూళ్లు అంశంపై ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ విద్యుత్‌ అధికారులను లక్షెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య నిలదీ శారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అదనపు చార్జీలు వసూలు చేస్తూ ప్రజలపై భారాన్ని మోపుతున్నా రని ఆరోపించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మిఓ దెలు మాట్లాడుతూ అధికారులు జవాబుదారితనంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో పనిచేయిస్తున్నారని ఆమె డీఈవో వెంకటేశ్వర్లుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ సంబంధిత అంశంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని కొనియాడారు.కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌కుమార్‌, జడ్పీటీసీలు చంద్రశేఖర్‌, నాగమణి, చంద్రయ్య, శిల్ప, స్వర్ణలత, సునీత, తిరుపతి,రవి, బానయ్య, శ్యామల, సృజన , మంత్రి బాపు, లక్ష్మి, రమాదేవి, సృజన, జడ్పీ డిప్యూటీ సీఈవో లక్ష్మీనారా యణ, సూపరింటెండెంట్‌ బాలకిషన్‌, సుమిత్‌ పాల్గొన్నారు.

- ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఎంపీ ఆగ్రహం

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు బోర్లకుంట వెంకటేశ్‌నేత ప్రోటో కాల్‌ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్‌ సమావేశాలు ప్రారంభమయ్యాక మధ్యాహ్నం 12.30 గంట లకు ఎంపీ సమావేశ మందిరానికి వచ్చారు.. రావడంతోనే జడ్పీ సీఈవో నరేందర్‌పై ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రపొటోకాల్‌ పాటించడం లేదని సీఈవోను కళ్లు దొబ్బాయా అంటూ తీవ్ర స్వరంతో మందలించారు. ఐసే స్టాండ ప్‌ అంటూ తీవ్ర స్వరంతో నిలబడేంత వరకు వాగ్వాదానికి దిగారు. స్టేజీపైకి పిలవడం లేదని, తానొస్తే లేచి నిలబడడం కూడా చేయకపోవడంతో ఎంపీ ఆగ్రహానికి గురయ్యా రని సభ్యులు చర్చించుకున్నారు. ఎంపీ ప్రవర్తనపై అందరు విస్తుపోయారు. ఎమ్మెల్యే చిన్నయ్య సముదాయించి మరో సీటులో కూర్చుండబెట్టడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సమావేశానికి అధికారులకు బదులు కింది స్ధాయి అధికారులు హాజ రవుతున్నారని చెప్పారు. సమావేశానికి రాని అధికారులకు నోటీసులు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు.

Updated Date - 2023-01-25T22:55:25+05:30 IST