ఓటు హక్కును వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2023-01-25T22:48:32+05:30 IST

రేపటి భవిష్యత్‌ కోసం సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉన్న ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగిం చుకోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి
మంచిర్యాలలో అధికారుల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ భారతి హోళికేరి

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 25: రేపటి భవిష్యత్‌ కోసం సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉన్న ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగిం చుకోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. బుధవారం 13వ జాతీయ ఓటరు దినో త్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, ఆర్డీవో వేణుతో కలిసి హాజరై అధికారుల చేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన వారందరు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. గతంలో ఓటరు నమోదుకు ప్రామాణికంగా ఉన్న జనవరి 1వ తేదీని ఓటర్ల సౌకర్యార్ధం మార్పు చేశారని చెప్పారు. జనవరి 1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలందించిన బూత్‌ స్థాయి అధికారులకు ప్రశంసాపత్రాలను అందించారు. జాతీయ ఓటరు దినో త్సవం నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహు మతులు అందజేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఏసీసీ: జిల్లా కేంద్రంలో పలు పాఠశాలల్లో ఓటు విలువపై అవగాహన కల్పించారు. పట్టణంలోని సాయికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వచఛంద సేవల ప్రతినిధి లయన్‌ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్ధులతో ర్యాలీ నిర్వహించి సమాజంలో ఓటు విలువ, ప్రాముఖ్యతను తెలియపర్చారు. వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి, ప్రభావతి, టీచర్లు నాగేశ్వర్‌రావు, వెంకటే ష్‌, మల్లేష్‌, శోభారాణి పాల్గొన్నారు.

నస్పూర్‌:నస్పూర్‌ మున్సిపాలిటీలో ఓటరు ప్రతిజ్ఞను నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, కమిషనర్‌ తన్నీరు రమేష్‌, మున్సిపల్‌, రెవెన్యూ ఆఫీసర్‌ సతీష్‌లతో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

దండేపల్లి: దండేపల్లి ప్రభుత్వ పాఠశాల, జూనియర్‌ కళాశాల విద్యార్ధులతో బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థుల చేత తహసీల్దార్‌ హన్మంతరావు ప్రతిజ్ఞ చేయిం చారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్లేషం, డిప్యూటి తహసీల్దార్‌ విజయ, ఆర్‌ఐ రంజి త్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

లక్షెట్టిపేట: పట్టణంలోని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో పాఠశాల విద్యార్థులతో తహసీల్దార్‌ జ్యోత్స్నప్రతిజ్ఞ నిర్వహించారు. అంతకుముందు పలు పాఠశాలల విద్యార్థులు, రెవెన్యూ సిబ్బందితో ఓటు ప్రాధాన్యత ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కాసుల రవీందర్‌, ఆర్‌ ఐ సంజీవ్‌, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని గురుకుల పాఠశాలలో గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ లలితా కుమారి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ కే. మహేశ్వర రావు, జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ జి. మౌనిక, సీనియర్‌ జేఎల్‌ ఎస్‌. రమాదేవి, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

చెన్నూరు: తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఓటర్ల చేత ఓటరు నమోదు అధికారి శ్రీరాములు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో చెన్నూరు తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావుదేశ్‌పాండే, డిప్యూటి తహసీల్దార్‌ గోవింద్‌, ఎన్నికల నాయబ్‌ తహసీల్దార్‌ వెంకటేశ్వర్‌రావు, సీనియర్‌అసిస్టెంట్‌ లక్ష్మీనారాయణ, ఆర్‌ఐలు తిరుపతి, స్వప్న, బీఎల్‌వోలు, డీలర్లు, ఓటర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T22:48:32+05:30 IST