ఉత్సాహంగా ఎడ్ల పందాలు

ABN , First Publish Date - 2023-01-25T22:51:54+05:30 IST

మండలంలోని గొళ్లపల్లిలో స్థానిక యువకులు బుధవారం నిర్వహించిన ఎడ్ల పందాలు ఉత్సాహంగా కొనసాగాయి.

ఉత్సాహంగా ఎడ్ల పందాలు
ఎడ్ల పరుగు పందెం పోటీలను ప్రారంభిస్తున్న సర్పంచ్‌ ఇందూరి శశికళ

నెన్నెల, జనవరి 15: మండలంలోని గొళ్లపల్లిలో స్థానిక యువకులు బుధవారం నిర్వహించిన ఎడ్ల పందాలు ఉత్సాహంగా కొనసాగాయి. ముఖ్య అథితిగా గొళ్లపల్లి సర్పంచ్‌ ఇందూరి శశికళ హాజరై ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 16 జతల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి. 1.5 కిలోమీటర్ల పరుగు పం దెం నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో పెద్ది వేణు (మందమర్రి), సత్తనవేణి బీరయ్య(టేకులపల్లి)లు నిలిచారు. నల్లి దిలీప్‌కుమార్‌ (ఇందారం) కన్సోలేషన్‌ బహుమతి గెలుచుకున్నారు. మొదటి బహుమతిగా రూ. 8 వేలు, రెండవ బహుమతిగా రూ. 6 వేలు, మూడవ బహుమతిగా రూ. 3వేలు నగదు అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల మల్లేష్‌, వైస్‌ చైర్మన్‌ కొయ్యడ శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ చైర్మన్‌ ఇందూరి రమేష్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు సాగర్‌గౌడ్‌, నాయకులు చీర్ల మొండన్న, అంకయ్య, నిర్వహకులు చింత విజ్ఞేష్‌, మెండె రవి, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T22:51:54+05:30 IST