ఎల్లలు దాటిన ప్రేమ!

ABN , First Publish Date - 2023-02-07T01:32:10+05:30 IST

ప్రేమకు ఎల్లలు లేవని ప్రేమకు జాతి మతం కులం దేశం హద్దులు లేవంటూ నిరూపించారు.

ఎల్లలు దాటిన ప్రేమ!

గుడిహత్నూర్‌, ఫిబ్రవరి 6: ప్రేమకు ఎల్లలు లేవని ప్రేమకు జాతి మతం కులం దేశం హద్దులు లేవంటూ నిరూపించారు. ప్రేమికులు, గుడిహత్నూర్‌ మండలం చింతగూడ గ్రామానికి చెందిన యువకుడు మయన్మార్‌ కు చెందిన యువతి ఒకరినొకరు ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లితో ఒకటయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం చింతగూడలో సోమవారం సెయింట్‌ థామస్‌ చర్చిలో గొల్లపల్లి రవికుమార్‌, మయన్మార్‌కు చెందిన జిన్‌న్వేథెన్‌ల వివాహాం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగింది. గొల్లపల్లి రవికుమార్‌ ఆరు సంవత్సరాల క్రితం ఖాతర్‌ దేశానికి వెళ్లాడు. రవికుమార్‌, మయన్మార్‌కు చెందిన జిన్‌న్వేథెన్‌ దోహ నగరంలోని హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో పని చేసే వారు. దీంతో ఇద్దరికి అక్కడ పరిచయం ఏర్పడడంతో ప్రేమించుకున్నారు. ఈ పెళ్లికి యువతి తరపున ఆమె సోదరుడు కేవ్‌థియేన్‌ హాజరయ్యాడు. వివాహానికి హాజరైన వారు ఇద్దరిని ఆశీర్వదించారు.

Updated Date - 2023-02-07T01:32:12+05:30 IST