అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి

ABN , First Publish Date - 2023-01-24T22:46:53+05:30 IST

మండలంలో అధికారులు, ప్రజాప్ర తినిధుల భాగస్వామ్యంతో అన్ని విధాల అభివృది సాధ్యమవుతుందని ఎంపీపీ నానయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీపీ అధ్యక్షతన మంగళవారం మండల సర్వ సభ్య సమా వేశం నిర్వహించారు.

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ నానయ్య

చింతలమానేపల్లి, జనవరి 24: మండలంలో అధికారులు, ప్రజాప్ర తినిధుల భాగస్వామ్యంతో అన్ని విధాల అభివృది సాధ్యమవుతుందని ఎంపీపీ నానయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీపీ అధ్యక్షతన మంగళవారం మండల సర్వ సభ్య సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో అధికారులు హాజరుకాకపోవడంతో సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఏఈవో లు స్థానికంగా ఉండడం లేదని, దీంతో రైతులకు సూచనలు అందడం లేదని ప్రస్తావించారు. ఏవో రామకృష్ణ మాట్లాడుతూ ఏఈఓలు అం దుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంమటామని తెలిపారు. మిషన్‌ భగీరథ నీరు ఏ గ్రామంలో సరిగ్గా రావడం లేదని సభ్యులు సమావే శంలో ప్రస్తావించారు. కొన్ని గ్రామాల్లో లీకేజీలు, మరమ్మతుల కార ణంగా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అందుకు నిధుల కొరత ఉందని నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని మిషన్‌ భగీరథ అధికారులు తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని, ఉపాధ్యాయులు లేని చోట్ల సర్దుబాటు చేయాలని ఎంఈవోను సభ్యులు కోరారు. అందుకు చర్యలు తీసుకుంటామని ఎం ఈవో తెలిపారు. వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. సమావేశంలో జడ్పీటీసీ శ్రీదేవి, తహసీల్దార్‌ మష్కూర్‌ అలీ, ఎంపీడీవో మహేందర్‌, వైస్‌ ఎంపీపీ మనోజిత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T22:46:53+05:30 IST