ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-02-01T22:50:22+05:30 IST

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 1: మన ఊరు మన బడి కార్యక్రమం మొదటి విడతలో భాగంగా ఎంపికైన పాఠశాలలో పనులు పూర్తైన మండలంలోని అంకు శాపూర్‌ తేలెగూడ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ బుధవారం ప్రారంభించారు.

ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన కలెక్టర్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 1: మన ఊరు మన బడి కార్యక్రమం మొదటి విడతలో భాగంగా ఎంపికైన పాఠశాలలో పనులు పూర్తైన మండలంలోని అంకు శాపూర్‌ తేలెగూడ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాలలో బెంచీలు, వంటశాల, భోజనశాల, ప్రహరీ, అదనపుగదులు, తాగునీరు, విద్యుత్‌ సరఫరా తదితర అన్నివసతులు కల్పించామ న్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ విద్యా రంగ అభివృద్ధి మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా అన్ని వసతులతో కూడిన నాణ్యమైనవిద్య అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్ర మంలో అదనపుకలెక్టర్‌లు రాజేశం, చాహత్‌ బాజ్‌పాయ్‌, డీఈవో అశోక్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, పంచాయతీరాజ్‌ ఈఈ, జడ్పీటీసీ నాగేశ్వర్‌రావు, ఎంపీపీ మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T22:50:24+05:30 IST