అభ్యర్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

ABN , First Publish Date - 2023-01-24T22:48:49+05:30 IST

జిల్లాలో గ్రూప్‌-3, 4 పరీక్షలకు సిద్ధమవు తున్న అభ్యర్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని అదనపు కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయి, రాజేశం అన్నారు.

అభ్యర్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
స్టడీ మెటీరియల్‌ అందజేస్తున్న అధికారులు

ఆసిఫాబాద్‌, జనవరి 24: జిల్లాలో గ్రూప్‌-3, 4 పరీక్షలకు సిద్ధమవు తున్న అభ్యర్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని అదనపు కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయి, రాజేశం అన్నారు. జిల్లా కేం ద్రంలోని కలెక్టరేట్‌ ఆవరణలో మంగళవారం జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ ను ఆర్‌డీవో రాజేశ్వర్‌తో కలిసి వారు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్స్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 99 మంది అభ్యర్థులకు 90 రోజుల శిక్షణ అనంతరం ఈ మెటీరియల్‌ను పంపిణీ చేశామని చెప్పారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమశా ఖాధికారి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T22:48:49+05:30 IST