జంతు సంరక్షణపై అవగాహన ర్యాలీ
ABN , First Publish Date - 2023-01-25T22:50:15+05:30 IST
పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులతో జాతీయ జంతు సంరక్షణ పక్షోత్సవాలను పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఏసీసీ/మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 25: పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులతో జాతీయ జంతు సంరక్షణ పక్షోత్సవాలను పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేశ్ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని ఆధికరణ 51ఏ (జి) అనుసరించి జంతువుల సంరక్షణ ప్రతి పౌరు డి బాధ్యత అన్నారు. అడవులు, వన్యజీవులు, సరస్సులు, నదులు, స హజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపర్చుకోవడం కోసం బాధ్యత గా పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి చౌదరి, పర్యావరణ పరిరక్షకుడు గుండేటి యోగేశ్వర్, ఇన్చార్జి హెచ్ఎం వేణుగోపాల్, శ్రీనివాస్, ఉదయ్, భాగ్యలక్ష్మి, నీల్కమల్, విద్యార్థులు పాల్గొన్నారు.