కోర్టుల్లో 1,904 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2023-01-06T05:04:10+05:30 IST

హైకోర్టు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల పరిధిలో చేపట్టే వివిధ పోస్టులకు సంబంధించిన రిక్రూట్‌మెంట్‌ క్యాలెండర్‌ను హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌ విడుదల చేశారు.

కోర్టుల్లో 1,904 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

హైకోర్టు నియామకాల క్యాలెండర్‌ విడుదల

పరీక్షల వివరాలు వెబ్‌సైట్‌లో లభ్యం

హైదరాబాద్‌, జనవరి 5(ఆంధ్రజ్యోతి): హైకోర్టు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల పరిధిలో చేపట్టే వివిధ పోస్టులకు సంబంధించిన రిక్రూట్‌మెంట్‌ క్యాలెండర్‌ను హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌ విడుదల చేశారు. అన్నిస్థాయిల్లోని దాదాపు 1,904 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు జారీచేశారు. రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసె్‌సలో డిస్ట్రిక్ట్‌ జడ్జి పోస్టులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కలిపి వివిధ స్థాయిలో మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. డిస్ట్రిక్ట్‌ జడ్జి నుంచి జూనియర్‌ సివిల్‌ జడ్జి వరకు మొత్తం పోస్టులు 560 ఉండగా, ప్రస్తుతం 410 మంది పనిచేస్తున్నారు. మొత్తం 150 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు హైకోర్టు వెల్లడించింది. జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ పోస్టులు, టెక్నికల్‌ పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన తేదీలను హైకోర్టు ప్రకటించింది. ఆయా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌లు, పరీక్షల తేదీల వివరాలను రిక్రూట్‌మెంట్‌ క్యాలెండర్‌ రూపంలో వెల్లడించింది. జిల్లా కోర్టుల పరిధిలో జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ పోస్టులు, టెక్నికల్‌ పోస్టులు మొత్తం 1,904 పోస్టులు ఉన్నట్లు వెల్లడించింది. వీటిలో ఎగ్జామినర్‌ పోస్టులు 66, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు 77, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 275, రికార్డు అసిస్టెంట్‌ పోస్టులు 97, ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టులు 163, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు 1,226 ఉన్నాయి. దరఖాస్తు, పరీక్షల తేదీలను హైకోర్టు వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

Updated Date - 2023-01-06T05:04:10+05:30 IST

Read more