వైద్యం అందక తల్లీబిడ్డ చనిపోవడమా..?

ABN , First Publish Date - 2023-01-12T04:51:55+05:30 IST

సరైన సమయంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతిచెందిన ఘటనపై హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వైద్యం అందక తల్లీబిడ్డ చనిపోవడమా..?

ఆ ఘటనపై వివరణ ఇవ్వండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

రైన సమయంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతిచెందిన ఘటనపై హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం ఎల్మపల్లికి చెందిన చారగొండ స్వర్ణ (24)కు సరైన సమయానికి వైద్యం అందకపోవడంతో తల్లీబిడ్డ మృతి చెందిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సూమోటోగా స్వీకరించింది. పురుటి నొప్పులతో బాధపడుతున్న స్వర్ణను బంధువులు స్థానిక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి అమ్రాబాద్‌కు, తర్వాత అచ్చంపేటకు, చివరికి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎక్కడా సరైన వైద్యం అందక చివరికి మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. తర్వాత కొద్దిసేపటికే బిడ్డ కూడా చనిపోయింది. ఈ ఘటనను హైకోర్టు బుధవారం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ తుకారామ్‌జీల ధర్మాసనం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌, వైద్యవిఽధాన పరిషత్‌ కమిషనర్‌, మహబూబ్‌నగర్‌, అచ్చంపేట, అమ్రాబాద్‌, నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు నోటీసులు జారీచేసింది.

Updated Date - 2023-01-12T04:51:55+05:30 IST