దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం: హరీశ్
ABN , First Publish Date - 2023-01-31T03:08:37+05:30 IST
ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
హైదరాబాద్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో పరకాల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎ్‌సలో చేరారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకరరావు కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, కేసీఆర్ అలుపెరగని పోరాటంతో తెలంగాణను సాధించడమే కాకుండా దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా మార్చారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, కేసీఆర్ విధానాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్‌ఎ్‌సలో చేరేందుకు ముందుకొస్తున్నారని స్పష్టం చేశారు.