బీఆర్‌ఎస్‌ పాలనకు వీఆర్‌ఎస్‌ పలకాలి

ABN , First Publish Date - 2023-05-11T00:43:55+05:30 IST

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ పాలనకు వీఆర్‌ఎస్‌ ఇవ్వాలని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని బస్‌డీపో వద్ద బీ జేపీ జెండాను ఆవిష్కరించినంతరం ఎంపీ నిధులతో కోర్టు ఆ వరణలో నిర్మిస్తున్న షెడ్‌కు ప్రొసీడింగ్‌ను అందజేత, పట్ట ణం లోని ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయమును స్థానిక నాయ కులతో కలిసి ప్రారంభించారు.

బీఆర్‌ఎస్‌ పాలనకు వీఆర్‌ఎస్‌ పలకాలి

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌

మెట్‌పల్లి, మే 10 : సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ పాలనకు వీఆర్‌ఎస్‌ ఇవ్వాలని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని బస్‌డీపో వద్ద బీ జేపీ జెండాను ఆవిష్కరించినంతరం ఎంపీ నిధులతో కోర్టు ఆ వరణలో నిర్మిస్తున్న షెడ్‌కు ప్రొసీడింగ్‌ను అందజేత, పట్ట ణం లోని ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయమును స్థానిక నాయ కులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మండలంలోని యు వకులు పార్టీలో చేరగా వారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వరి వేయండి అని చె ప్పి నేడు కొనుగోలు చేయకుండా ప్రతి సారి కేంద్రంను నిం దిస్తూ పంపించిన కమిషన్‌ రూ. 15వందల కోట్లను పక్కదారి పట్టించి రైతులను మోసం చేయడానికి సిగ్గుండాలని విమర్శిం చారు. ఎన్నికల సమయంలో బోల్తా కొట్టడానికి రాసే మేనిఫె స్టో తప్ప చేసిందేం లేదన్నారు. కేసీఆర్‌ కుటుంబం చేస్తున్న అరాచకాలను ఈడీ ప్రశ్నిస్తే కేంద్రం అడుతున్న ఆటలు అంటున్నారు. నేడు సీబీఐ దాడులు నిర్వహించి దేశంలో రూ. 11ల క్షల కోట్లను సేకరించి రోడ్లు, రైళువేలతో పాటు అభివృద్ధి పను లను చేస్తుందన్నారు. కవిత చేసిన అరాచకాలకు జైలుకు ఎప్పు డు పోతుందని రాష్ట్రంలోని కోటి కళ్లు ఎదురు చూస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ, పట్ట ణ అధ్యక్షుడు బోడ్ల రమేష్‌, నాయకులు సురభి నవీన్‌ రావు, సాంబారి ప్రభాకర్‌, దోనికేల నవీన్‌, పీసు రాజేం దర్‌రెడ్డి, బద్దం గంగాధర్‌రెడ్డి, సుఖేంధర్‌గౌడ్‌, సునీత, ఆకుల శ్రీనివాస్‌, మంచాల శివ, కార్యకర్తలు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-11T00:43:55+05:30 IST