Women's U-19 World Cup Semis : ఆత్మవిశ్వాసంతో భారత్‌

ABN , First Publish Date - 2023-01-27T03:15:48+05:30 IST

మహిళల తొలి అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో అదరగొడుతున్న భారత్‌ సెమీ్‌సకు దూసుకొచ్చింది. షఫాలీ వర్మ సారథ్యంలోని భారత్‌ శుక్రవారం జరిగే సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో

Women's U-19 World Cup Semis : ఆత్మవిశ్వాసంతో భారత్‌

నేడు కివీస్‌తో అండర్‌-19 వరల్డ్‌ కప్‌ సెమీస్‌

పోచె్‌ఫస్ట్రూమ్‌ (సౌతాఫ్రికా) : మహిళల తొలి అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో అదరగొడుతున్న భారత్‌ సెమీ్‌సకు దూసుకొచ్చింది. షఫాలీ వర్మ సారథ్యంలోని భారత్‌ శుక్రవారం జరిగే సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో పోరుకు సై అంటోంది. మధ్యాహ్నం 1.30కు ఈ మ్యాచ్‌ మొదలవుతుంది. గ్రూప్‌ దశ మూడు మ్యాచ్‌ల్లో మూడూ గెలుపొందిన టీమిండియా టాపర్‌గా నిలిచింది. అలాగే సూప ర్‌ సిక్స్‌లోనూ గ్రూప్‌-1లో అగ్రస్థానం సాఽధించింది. కెప్టెన్‌ షఫాలీ సహా టాపార్డర్‌ బ్యాటర్లు శ్వేత, రిచా, తెలుగు క్రికెటర్‌ గొంగడి త్రిష సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. కాగా..సాయంత్రం 5.15కు ప్రారంభమయ్యే మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్లు తలపడతాయి.

Updated Date - 2023-01-27T03:15:50+05:30 IST