ఐసీసీ వన్డే టీమ్‌లో సిరాజ్‌, అయ్యర్‌

ABN , First Publish Date - 2023-01-25T00:35:42+05:30 IST

గతేడాది వన్డేల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌తోపాటు మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌

ఐసీసీ వన్డే టీమ్‌లో సిరాజ్‌, అయ్యర్‌

టెస్టుల్లో పంత్‌కు చోటు

దుబాయ్‌: గతేడాది వన్డేల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌తోపాటు మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌కు ఐసీసీ పురుషుల వన్డే టీమ్‌ 2022’లో చోటు దక్కింది. భారత్‌ నుంచి వీరిద్దరికే స్థానం కల్పించిన ఐసీసీ.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ను సారథిగా ఎంపిక చేసింది. ఐసీసీ టెస్ట్‌ టీమ్‌ 2022లో భారత్‌ నుంచి రిషభ్‌ పంత్‌కు మాత్రమే చోటు దక్కింది. గతేడాది టెస్టుల్లో 25ఏళ్ల పంత్‌ 12 ఇన్నింగ్స్‌ల్లో 680 రన్స్‌ చేశాడు. బెన్‌ స్టోక్స్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

హర్మన్‌, మంధానకు చోటు

ఐసీసీ మహిళల వన్డే జట్టులో టీమిండియా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, బౌలర్‌ రేణుక సింగ్‌కు స్థానం లభించింది.

Updated Date - 2023-01-25T00:35:47+05:30 IST