ప్రీక్వార్టర్స్‌కు సేన్‌, సైనా

ABN , First Publish Date - 2023-01-26T00:12:30+05:30 IST

లక్ష్యసేన్‌, సైనా నెహ్వాల్‌ ఇండోనేసియా మాస్టర్స్‌లో శుభారంభం చేశారు. బుధవా రం జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సైనా 21-15, 17-21, 21-15తో పాయ్‌ యుపై గెలిచింది.

ప్రీక్వార్టర్స్‌కు సేన్‌, సైనా

జకార్త: లక్ష్యసేన్‌, సైనా నెహ్వాల్‌ ఇండోనేసియా మాస్టర్స్‌లో శుభారంభం చేశారు. బుధవా రం జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సైనా 21-15, 17-21, 21-15తో పాయ్‌ యుపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో లక్ష్యసేన్‌ 21-11, 21-11తో నరకోవాను చిత్తు చేసి ప్రీక్వార్టర్స్‌కు చేరాడు. కిడాంబి శ్రీకాంత్‌ 10-21, 22-24తో హిరెన్‌ చేతిలో, ప్రణయ్‌ 19-21, 10-21తో సునుయామా చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. సింగిల్స్‌లో మాళవిక బన్సోడ్‌, ప్రియాన్షు, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఇషాన్‌ భట్నాగర్‌, తనీషా జోడీ, సిక్కిరెడ్డి, రోహన్‌ కపూర్‌ ద్వయం కూడా తొలి రౌండ్‌లో పరాజయం పాలయ్యారు.

Updated Date - 2023-01-26T00:12:44+05:30 IST