సెమీఫైనల్లో సానియా-బోపన్న జోడీ

ABN , First Publish Date - 2023-01-25T00:37:47+05:30 IST

భారత స్టార్‌ జోడీ సానియా మీర్జా-రోహన్‌ బోపన్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌కు రెండడుగుల

సెమీఫైనల్లో సానియా-బోపన్న జోడీ

భారత స్టార్‌ జోడీ సానియా మీర్జా-రోహన్‌ బోపన్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచింది. తమ క్వార్టర్‌ఫైనల్‌ ప్రత్యర్థి జెలెనా ఓస్టాపెంకో (లాత్వియా)-డేవిడ్‌ హెర్నాండెజ్‌ (స్పెయిన్‌) జంట నుంచి వాకోవర్‌ లభించడంతో సానియా ద్వయం నేరుగా సెమీస్‌ చేరింది. సెమీ్‌సలో మూడోసీడ్‌ క్రాజిక్‌ (అమెరికా)-నీల్‌ స్కుప్‌స్కీ (బ్రిటన్‌) జంటతో సానియా జోడీ పోటీపడనుంది.

Updated Date - 2023-01-25T00:37:47+05:30 IST