Australian Open : సబలెంకా X రిబకినా

ABN , First Publish Date - 2023-01-27T03:21:57+05:30 IST

ఐదో సీడ్‌ అర్యానా సబలెంకా, 22వ సీడ్‌ ఎలెనా రిబకినా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. గురువారం జరిగిన సెమీఫైనల్లో సబలెంకా (బెలారస్‌) 7-6(1), 6-2 స్కోరుతో

 Australian Open : సబలెంకా X రిబకినా

టైటిల్‌ కోసం అమీతుమీ

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌ : ఐదో సీడ్‌ అర్యానా సబలెంకా, 22వ సీడ్‌ ఎలెనా రిబకినా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. గురువారం జరిగిన సెమీఫైనల్లో సబలెంకా (బెలారస్‌) 7-6(1), 6-2 స్కోరుతో అన్‌సీడెడ్‌ మగ్దా లినెటి (పోలెండ్‌)ని చిత్తు చేసింది. అంతకుముందు జరిగిన తొలి సెమీస్‌లో రిబకినా (కజకిస్థాన్‌) 7-6 (4), 6-3 స్కోరుతో రెండుసార్లు చాంపియన్‌ విక్టోరియా అజరెంకా (బెలార్‌స)కు షాకిచ్చింది. మొదటి సెమీఫైనల్‌ తొలి సెట్‌లో రిబకినా, అజరెంకా నువ్వా..నేనా..అన్నట్టు తలపడ్డారు. మొదటి సెట్‌ను గెలిచిన ఉత్సాహంలో విజృంభించిన రిబకినా సునాయాసంగా రెండో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సబలెంకా-లినెటి పోరుకూడా శీతల గాలుల మధ్య జరిగింది. మొదటి గేమ్‌లో ‘లవ్‌’తో సర్వీస్‌ చేజార్చుకున్న సబలెంకా..ఆపై బ్యాక్‌హ్యాండ్‌ షాట్లతో చెలరేగి ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసింది. కానీ తేరుకున్న లినెటి దీటైన ఆటతో సెట్‌ను టైబ్రేకర్‌కు తీసుకుపోయింది. అయితే టై బ్రేకర్‌లో సబలెంకా సెట్‌ను చేజిక్కించుకుంది. ఇక రెండోసెట్‌లో సబలెంకాకు నల్లేరుపై బండినడకే అయింది.

సానియా-బోపన్న మిక్స్‌డ్‌ డబుల్స్‌- ఉ. 6.30 నుంచి

పురుషుల సింగిల్స్‌ ఖచనోవ్‌ గీ సిట్సిపా్‌స-ఉ.9 గం.

జొకోవిచ్‌ గీ పాల్‌ - మ. 2 గం.

సోనీస్పోర్ట్స్‌ టెన్‌-3, 5

Updated Date - 2023-01-27T03:21:58+05:30 IST