రోహిత్‌ రాయుడు శతకం

ABN , First Publish Date - 2023-01-26T00:10:51+05:30 IST

రోహిత్‌ రాయుడు (153 నాటౌట్‌) అజేయ శతకంతో.. గ్రూప్‌-బిలో భాగంగా ఢిల్లీతో రంజీలో హైదరాబాద్‌ మెరుగైన స్కోరు చేసింది.

రోహిత్‌ రాయుడు శతకం

హైదరాబాద్‌: రోహిత్‌ రాయుడు (153 నాటౌట్‌) అజేయ శతకంతో.. గ్రూప్‌-బిలో భాగంగా ఢిల్లీతో రంజీలో హైదరాబాద్‌ మెరుగైన స్కోరు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 247/4తో ఆటకు రెండో రోజైన బుధవారం ఆటను కొనసాగించిన హైదరాబాద్‌ 355 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఢిల్లీ.. ఆట చివరకు 223/5 స్కోరు చేసింది. యశ్‌ ధుల్‌ (72), బదోని (78 బ్యాటింగ్‌) రాణించాలు చేశారు. హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఢిల్లీ 132 రన్స్‌ వెనుకబడి ఉంది.

Updated Date - 2023-01-26T00:10:51+05:30 IST