India x Aussie Test Series: హోరాహోరీ ఖాయమే!

ABN , First Publish Date - 2023-02-07T03:02:22+05:30 IST

యాషెస్‌ సిరీస్‌ అంటే.. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య హోరాహోరీగా సాగే టెస్ట్‌ సమరం. ఇప్పుడు టెస్టుల్లో రెండు అగ్రశ్రేణి జట్లు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగే ‘బోర్డర్‌-గవాస్కర్‌’ ట్రోఫీకి కూడా అంతకు మించి ప్రాధాన్యత ఏర్పడింది.

India x Aussie Test Series: హోరాహోరీ ఖాయమే!

9 నుంచి భారత్‌ x ఆసీస్‌ టెస్టు సిరీస్‌

న్యూఢిల్లీ: యాషెస్‌ సిరీస్‌ అంటే.. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య హోరాహోరీగా సాగే టెస్ట్‌ సమరం. ఇప్పుడు టెస్టుల్లో రెండు అగ్రశ్రేణి జట్లు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగే ‘బోర్డర్‌-గవాస్కర్‌’ ట్రోఫీకి కూడా అంతకు మించి ప్రాధాన్యత ఏర్పడింది. 1947, నవంబరు 28న బ్రిస్బేన్‌లో కంగారూలతో భారత్‌ తొలిసారి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడింది. ఐదు దశాబ్దాలపాటు ఆసీస్‌దే ఆధిపత్యం కాగా.. ఆ తర్వాత స్వదేశంలో టీమిండియా బలమైన శక్తిగా ఎదిగింది. 2018-19లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై 2-1తో ఓడించి చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆ తర్వాత 2020-21 పర్యటనలో మరోసారి కంగారూలకు దిమ్మదిరిగేలా చేసింది. పైగా వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ చేరడానికి రోహిత్‌ సేనకు ఇదే చివరి అవకాశం కావడంతో గురువారం నుంచి జరిగే నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ హోరాహోరీగా జరగడం ఖాయమని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర గణాంకాలు, రికార్డులు..

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 102 టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగితే అందులో, భారత్‌ 30.. ఆస్ట్రేలియా 43 గెలిచాయి. 28 మ్యాచ్‌లు డ్రా కాగా.. ఒకటి టై అయింది.

ఆస్ట్రేలియాపై మూడు వేలకుపైగా పరుగులు సాధించిన ముగ్గురు బ్యాటర్లలో సచిన్‌ టెండూల్కర్‌ (39 టెస్టుల్లో 3630 రన్స్‌) ఒకడు.

ఆసీ్‌సపై అన్ని ఫార్మాట్లలో కలిపి సచిన్‌ 20 శతకాలు బాదడం ప్రపంచ రికార్డు.

టెస్టుల్లో తొలి హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌గా హర్భజన్‌ సింగ్‌. 2000-01లో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్లు రికీ పాంటింగ్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, షేన్‌ వార్న్‌ను భజ్జీ వరుస బంతుల్లో అవుట్‌ చేశాడు.

మూడు టెస్ట్‌ సిరీస్‌ (2000-01)లో అత్యధికంగా 32 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా హర్భజన్‌ సింగ్‌.

ఈడెన్‌ గార్డెన్స్‌లో 2001లో జరిగిన మ్యాచ్‌లో ఫాలో-ఆన్‌లో పడిన భారత్‌.. ద్రవిడ్‌-లక్ష్మణ్‌ ఐదో వికెట్‌కు 376 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో ఆసీ్‌సను ఓడించి పెను సంచలనం సృష్టించింది. టీమిండియా 171, 657/7 డిక్లేర్డ్‌ స్కోర్లు చేయగా.. 445, 212 పరుగులు చేసిన ఆస్ట్రేలియా 171 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.

ఆస్ట్రేలియాపై వంద వికెట్ల మైలురాయిని చేరిన ఏకైక బౌలర్‌ అనిల్‌ కుంబ్లే.

ఆసీ్‌సపై ఓ సిరీ్‌సలో నాలుగు శతకాలు బాదిన భారత బ్యాటర్‌గా కోహ్లీ. 2014-15 సీజన్‌లో ఆడిన నాలుగు టెస్టుల సిరీ్‌సలో విరాట్‌ 86.50 సగటుతో 692 పరుగులు సాధించాడు. కంగారూలతో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన కెప్టెన్‌గా కోహ్లీ.

Updated Date - 2023-02-07T08:29:11+05:30 IST