ప్రభుత్వ పర్యవేక్షణ కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి

ABN , First Publish Date - 2023-01-25T00:38:35+05:30 IST

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై పర్యవేక్షణ కమిటీని

ప్రభుత్వ పర్యవేక్షణ కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి

న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై పర్యవేక్షణ కమిటీని నియమించే ముందు ప్రభుత్వం తమను సంప్రదించలేదని నిరసనలో పాల్గొన్న టాప్‌ రెజ్లర్లు బజ్‌రంగ్‌ పూనియా, వినేశ్‌ ఫొగట్‌, సాక్షి మాలిక్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాక్సర్‌ మేరీకోమ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా డబ్ల్యూఎఫ్‌ఐ రోజువారీ కార్యక్రమాలను కూడా ఈ కమిటీ పర్యవేక్షించనుందని మంత్రి తెలిపారు. ‘పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసే ముందు మాతో చర్చిస్తామనే హామీ ఇచ్చారు. కానీ, మమ్మల్ని సంప్రదించకుండానే కమిటీ వేయడం బాధాకరం’ అని రెజ్లర్లు ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలకు కూడా ట్యాగ్‌ చేశారు.

Updated Date - 2023-01-25T00:38:36+05:30 IST