విండీస్‌పై అమ్మాయిల విజయం

ABN , First Publish Date - 2023-01-25T00:34:36+05:30 IST

డాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (74 నాటౌట్‌), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (56 నాటౌట్‌) అదరగొట్టడంతో.. మహిళల టీ20 ముక్కోణపు సిరీ్‌సలో

విండీస్‌పై అమ్మాయిల విజయం

ఈస్ట్‌ లండన్‌ (సౌతాఫ్రికా): డాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (74 నాటౌట్‌), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (56 నాటౌట్‌) అదరగొట్టడంతో.. మహిళల టీ20 ముక్కోణపు సిరీ్‌సలో భారత జట్టు 56 పరుగుల తేడాతో వెస్టిండీ్‌సను చిత్తు చేసింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 167 పరుగులు చేసింది. తర్వాత ఛేదనలో విండీస్‌ ఓవర్లన్నీ ఆడి 111/4 స్కోరుకే పరిమితమైంది. షిమెయిన్‌ క్యాంప్‌బెల్‌ (47), హేలే (34 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది వరుసగా రెండో విజయం. సిరీస్‌లో భారత్‌, వెస్టిండీ్‌సతోపాటు సౌతాఫ్రికా కూడా ఆడుతోంది.

Updated Date - 2023-01-25T00:34:36+05:30 IST