కమింగ్‌ సూన్‌.. షోలే-2

ABN , First Publish Date - 2023-01-27T03:17:07+05:30 IST

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాల మధ్య చక్కటి దోస్తానా ఉందనే విషయం అభిమానులకు తెలిసే ఉం టుంది. న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌ ధోనీ స్వస్థలం రాంచీలోనే

కమింగ్‌ సూన్‌.. షోలే-2

రాంచీ: ఎంఎస్‌ ధోనీ.. భారత టీ20 జట్టు

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాల మధ్య చక్కటి దోస్తానా ఉందనే విషయం అభిమానులకు తెలిసే ఉం టుంది. న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌ ధోనీ స్వస్థలం రాంచీలోనే కావడంతో పాండ్యా అతడి ఇంటికి వెళ్లి కలుసుకున్నాడు. ఈనేపథ్యంలో మహీ గ్యారేజిని కూడా సందర్శించాడు. షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్‌ ‘యే దోస్తీ.. హమ్‌ నహీ ఛోడేంగే’ అనే పాట పాడుకుంటూ వెళ్లిన బైక్‌ గుర్తుంది కదా. అచ్చం అలాంటి బండిపైనే హార్దిక్‌, ధోనీ కూర్చుని ఫొటోలకు పోజిచ్చారు. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన పాండ్యా ‘షోలే 2 కమింగ్‌ సూన్‌’ అంటూ సరదాగా పేర్కొనడం విపరీతంగా ఆకర్షిస్తోంది.

Updated Date - 2023-01-27T03:17:08+05:30 IST