బికిని వేసుకుని పొలం పనులు చేస్తున్న అమ్మాయిపై ట్రోల్స్.. ఏమని సమాధానం ఇచ్చిందంటే..

ABN , First Publish Date - 2023-02-01T18:48:32+05:30 IST

పొలంలో పనిచేసే ఆడవారికి భిన్నంగా ఈమె చే్స్తున్న పనికి దారుణంగా ట్రోల్స్..

బికిని వేసుకుని పొలం పనులు చేస్తున్న అమ్మాయిపై ట్రోల్స్.. ఏమని సమాధానం ఇచ్చిందంటే..

ఎక్కడైనా పొలం పనులు చేస్తున్న ఆడవారిని గమనిస్తే చీర గోచిలాగా కట్టి వరినాట్లు వేస్తూనో, చీర కుచ్చిళ్ళు పైకి కట్టి విత్తనాలు చల్లుతూనో కనబడతారు. అయితే అందుకు భిన్నంగా బికినీ వేసుకుని పొలం పనులు చేస్తోంది ఒక మహిళ. ఆమె ఫోటోస్ చూసిన నెటిజన్లు దారుణమైన ట్రోల్స్ వేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాలలోకి వెళితే..

WhatsApp Image 2023-02-01 at 6.22.57 PM.jpeg

తనను తాను బికిని ఫార్మర్ అని పిలుచుకునే ఓ ఫారిన్ మహిళ వ్యవసాయం చేస్తుంది. ఆమె తను పొలం పనులు చేస్తున్న వీడియోలు, ఫోటోస్ ను టిక్ టాక్ లో పోస్ట్ చేస్తుంటుంది. ఈమెకు లక్షల కొద్ది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే బికిని వేసుకుని పొలం పనులు చేస్తుందని, ఆ డ్రెస్సింగ్ గురించి చాలా దారుణంగా ట్రోల్స్ వేస్తున్నారు నెటిజన్లు. ఈమె మాత్రం ఆ ట్రోల్స్ కు ఏమాత్రం భయపడకుండా, మరేమాత్రం లైట్ తీసుకోకుండా 'నాకు ఇష్టమైన దుస్తులు నేను వేసుకుంటాను. అమ్మాయిలకు వారు ఏమి వేసుకోవాలో సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంది' అని ఘాటుగానే సమాధానం ఇచ్చింది. 'The bikini farmer' అని గూగుల్ లో సెర్చ్ చేస్తే ఈమె గురించి బోలెడు సమాచారం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ బికినీ అమ్మాయ్ భలే వైరల్ అవుతోంది.

Updated Date - 2023-02-01T19:03:03+05:30 IST