బాయ్‌ఫ్రెండ్‌లో కాన్ఫిడెన్స్ పెంచేందుకు ఏ యువతీ చేయకూడని పని చేసింది.. చివరకు వారి బంధం ఏ మలుపు తిరిగిందంటే..

ABN , First Publish Date - 2023-03-19T19:07:10+05:30 IST

బాయ్‌ఫ్రెండ్‌లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచేందుకు ఆమె చేసిన పని ఎలా వికటించిందంటే..

బాయ్‌ఫ్రెండ్‌లో కాన్ఫిడెన్స్ పెంచేందుకు ఏ యువతీ చేయకూడని పని చేసింది.. చివరకు వారి బంధం ఏ మలుపు తిరిగిందంటే..

ఇంటర్నె్ట్ డెస్క్: ఆమె బాయ్‌ఫ్రెండ్‌లో ఏదో తెలియని బిడియం.. కాన్ఫిడెన్స్ లేనట్టు వ్యవహరిస్తుంటాడు. తన లుక్స్ బాగుండవని అనుకుంటూ ఉంటాడు. దీంతో.. యువతికి తన ప్రియుడిపై జాలి కలిగింది. అతడు హ్యాండ్సమ్‌గా ఉంటాడని ఆమెకు గట్టి నమ్మకం. దీంతో.. ప్రియుడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచేందుకు ఏదైనా చేయాలని డిసైడైపోయింది. ఈ క్రమంలో అతడు హ్యాండ్సమ్‌గా ఉంటాడంటూ పలుమార్లు పొగిడింది. అందరి ముందూ కాంప్లిమెంట్స్ ఇచ్చింది. అయితే.. మనోడిలో మార్పు రాలేదు. ఇలా పనికాదనుకుని ఏ గర్ల్‌ఫ్రెండ్ చేయని సాహసాన్ని చేసింది. అదే చివరకు ఆమె కొంప ముంచించి.

బాయ్‌ఫ్రెండ్‌లోని ఆత్మన్యూనతను దూరం చేసేందుకు ఆమె అతడి పేరు మీద టిండర్ యాప్‌లో ఓ ప్రొఫైల్ క్రియేట్ చేసింది(Woman makes tinder profile). అతడిలోని సుగుణాలన్నీ పొందుపరిచింది. అంతేకాకుండా.. బాయ్‌ఫ్రెండ్‌ ఫొటోల్లో తనకు బాగా నచ్చినది ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టింది. ఇలా ప్రియుడి ప్రొఫైల్‌ను చాలా జాగ్రత్తగా తీర్చి దిద్దడంతో అతడికి ఇతర యువతుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజునే డజన్‌కు పైగా మ్యాచ్‌లు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పేసరికి అతడి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ముఖంలో కొత్త కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్టు కనిపించింది. ‘‘అతడి కళ్లల్లో ఏదో తెలియని ఆనందం కనిపించింది’’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఆ తరువాతే వారి కథ అనూహ్య మలుపు తిరిగింది.

టిండర్‌లో తన పాపులారిటీ పెరగడం చూసిన అతడిలో దుర్బుద్ధి ప్రవేశించింది. తనకు మెసేజ్ పెట్టిన ప్రతి అమ్మాయికీ అతడు రిప్లై ఇస్తూ పోయాడు. కానీ ఈ విషయాలేవీ ఆమెకు తెలీదు. రెండు రోజుల తరువాత ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్ అకౌంట్ చెక్ చేసి చూడగా మొత్తం బండారం బయటపడింది. దీంతో.. అతడి దుమ్ముదులిపేసిన యువతి చివరకు బ్రేకప్ చెప్పేసింది.

Updated Date - 2023-03-19T19:08:47+05:30 IST