నా పర్ఫామెన్స్ గనుక మీకు నచ్చినట్టైతే.. అంటున్న వైల్డ్ అనిమల్.. ఎంత వగలుపోయిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , First Publish Date - 2023-01-30T16:44:46+05:30 IST

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇన్ని సెల్పీలు బహుశా మనుషులు కూడా తీసుకుని ఉండరు

నా పర్ఫామెన్స్ గనుక మీకు నచ్చినట్టైతే.. అంటున్న వైల్డ్ అనిమల్..  ఎంత వగలుపోయిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

మనుషులు కొత్త వస్తువులను చూసినప్పుడు, తాకినప్పుడు ఎలాగయితే విచిత్రంగా స్పందిస్తారో జంతువులు కూడా అలాగే స్పందిస్తాయి. కొన్ని సార్లు వాటి రియాక్షన్ లు చాలా ఫన్నీగా ఉంటాయి. ప్రస్తుతం ట్విట్టర్ లో ఇలాంటి న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. కెమెరా ముందు ఓ ఎలుగుబంటి వయ్యారాలన్నీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలలోకి వెళితే..

కొలరాడో రేంజ్ పార్క్ లో వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా వాటిని ఎప్పటికప్పుడు గమనించడం కోసం కొన్ని కెమెరాలు ఏర్పాటు చేసారు. అలాంటి కెమెరాలాలలో ఒకటి ఓ ఎలుగుబంటి కంటబడింది. ఆ కెమెరా ముందు ఆ ఎలుగుబంటి చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ తిరిగింది. ఆ సమయంలో ఆ కెమెరా ఆటోమెటిక్ గా ఫొటోలు ఫ్లాష్ చేసేసింది. అలా ఒకటి రెండు కాదు ఏకంగా 580 ఫొటోలు అందులో నమోదు అయ్యాయి. వాటిలో వగలుపోయిన ఈ ఎలుగుబంటి సెల్పీలే 400 వరకు ఉన్నాయి. వాటిలో కొన్ని ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఎలుగుబంటి ఎక్స్ప్రెషన్స్ చూసి వైల్డ్ లైప్ ఫోటోగ్రాఫర్ల నుండి నెటిజన్స్ వరకు అందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. నా ఫర్ఫామెన్స్ గనుక మీకు నచ్చినట్టైతే.. అని దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు లేదు ఈ ఎలుగుబంటి లుక్స్ చూస్తోంటే..

Updated Date - 2023-01-30T16:45:58+05:30 IST