Viral Video: అక్కకు కాబోయే భర్తను ఆటపట్టించాలనుకుంటే ఇలా జరిగిందేంటి..? కూల్‌డ్రింక్స్‌ను ఈ యువతి తీసుకెళ్లింది కానీ..
ABN , First Publish Date - 2023-01-20T15:39:18+05:30 IST
బావ-మరదలి రిలేషన్, వారి మధ్య జరిగే సరదా పనులు ఓ రేంజ్ లో ఉంటాయి. పెళ్ళిలో తన అక్క భర్తను ఆటపట్టించాలనుకున్న ఓ మరదలి ప్లాన్
భారతీయుల పెళ్ళిలో కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మరీ ముఖ్యంగా పెళ్ళికొడుకు పెళ్లికూతురు స్నేహితులు, తోడబుట్టినవారు పెళ్ళిలో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక బావ-మరదలి రిలేషన్, వారి మధ్య జరిగే సరదా పనులు ఓ రేంజ్ లో ఉంటాయి. పెళ్ళిలో తన అక్క భర్తను ఆటపట్టించాలనుకున్న ఓ మరదలి ప్లాన్ బెడిసికొట్టగా పెళ్ళికి వచ్చిన వారిని, నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోందీ సంఘటన. దీనికి సంబందించిన వివరాల్లోకి వెళితే..
అక్క భర్తను ఆటపట్టంచాలని ఓ మరదలు వేసిన ప్లాన్ చెత్తగా చిత్తయిపోయింది. ఏ ప్రాంతంలో జరిగిందో, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. పెళ్ళికూతురి చెల్లెలు తన బావను ఆటపట్టించాలని ఒక ట్రేలో గాజు గ్లాసులు పెట్టి వాటిలో కూల్ డ్రింకులు నింపి వాటిని అతని దగ్గరకు తీసుకెళ్ళింది. అతని ప్రక్కన కూర్చుని 'ఇదిగో బావా ఒక చిన్న ఛాలెంజ్.. ఈ గ్లాసుల్లో ఉన్న కూల్ డ్రింక్స్ ను నువ్వు తాగెయ్యాలి. అయితే ఒక షరతు, గ్లాసులను చేతుల్లోకి తీసుకోకుండా టచ్ చెయ్యకుండా తాగెయ్యాలి' అని చెప్పింది. పెళ్ళి కొడుకు ప్రక్కనే ఉన్న అతని స్నేహితుడు 'అలా ఎలా తాగుతారు అసలు లాజిక్ లేని ఛాలెంజ్' అంటూ ఆ అమ్మాయితో గొడవ పడ్డాడు.
వారిద్దరూ వాదులాడుకుంటున్న క్రమంలో ఆ అమ్మాయి తను కూర్చున్న కుర్చీలో నుండి జారిపడిపోయింది. ఆమె చేతిలో ఉన్న ట్రే, అందులో ఉన్న జ్యూసుల గ్లాసులు కూడా పడిపోయాయి. ఇదంతా చూసిన అక్కడివారు పడిపోయిన ఆ అమ్మాయిని లేపకపోగా ఒకటే నవ్వుల్లో మునిగిపోయారు. ఈ సంఘటన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. చాలా మంది ఆ అమ్మాయి గురించి ఫన్నీ కామెంట్స్ పెట్టారు. మరికొందరు పాపం అంటూ సానుభూతి వ్యక్తం చేసారు.