Viral Video: ఊహించని కామెంట్స్ విని పగలబడి నవ్వుకున్న వధూవరులు.. సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!

ABN , First Publish Date - 2023-01-20T17:02:43+05:30 IST

పెళ్ళిలో ఇలాంటి ఉదాహరణ ఇవ్వడంతో అక్కడ ఊహించని విధంగా..

Viral Video: ఊహించని కామెంట్స్ విని పగలబడి నవ్వుకున్న వధూవరులు.. సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!

పెళ్ళిలో వధూవరుల విషయంలో చాలా సరదా సంఘటనలు జరుగుతుంటాయి. వారిని అందరూ ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే పెళ్ళి జరిపిస్తున్న పంతులుగారు కూడా సరదాగా వధూవరుల విషయంలో చమత్కారం చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి చమత్కారం ఓ పెళ్ళిలో కనిపించింది. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

పెళ్ళిలో వధూవరులకు కొన్ని ధర్మాలు చెబుతారు. వాటికి లోబడి జీవితాంతం కలిసి ఉండమని చెప్పడమే దాని ఉద్దేశం. అయితే ఒక పెళ్ళిలో పంతులుగారు పెళ్ళికూతురుకు పతివ్రత ధర్మం గురించి చెబుతూ ఓ అడుగు ముందుకేసి ఉదాహరణ కూడా ఇచ్చారు. 'నాతో పాటు నలుగురు స్నేహితులు కూడా వస్తున్నారు.. టీ పెట్టి ఉంచు అని భర్త చెప్పగానే.. చేయను అని భార్య చెప్పకూడదు. బిజీగా ఉన్నానని కారణాలు కూడా చెప్పకూడదు. అలా చెబితే భార్యాభర్తల మధ్య విబేధాలు వస్తాయి. అలా కాకుండా నీ స్నేహితులను ఇంటికి తీసుకురావద్దు అని చెప్పావనుకో.. అసలు ఎవరికీ ఇబ్బంది ఉండదు.... అంటూ ఆ పురోహితుడు ఉదాహరణతో సహా చెప్పడంతో అక్కడున్న బంధువులంతా కడుపుబ్బా నవ్వారు.. దీనికి సంబందించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వీడియో చూసిన నెటిజన్లు సదరు పంతులుగారి చమత్కారానికి ధీటుగా కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-01-20T17:02:45+05:30 IST