Viral: ఐదేళ్ళ బుడ్డిదాని లెక్కల హోమ్ వర్క్.. సమాధానాలు చూస్తే టెంప్ట్ అవుతారు..

ABN , First Publish Date - 2023-02-02T16:15:38+05:30 IST

ఈ జనరేషన్ పిల్లలు తెలివిలోనూ దాన్ని బయటకు తెలపడంలోనూ రెండాకులు ఎక్కువే అనుకోవచ్చు.

Viral: ఐదేళ్ళ బుడ్డిదాని లెక్కల హోమ్ వర్క్.. సమాధానాలు చూస్తే టెంప్ట్ అవుతారు..

పిల్లల దగ్గర కావలసినంత ప్రేమ, సరదా, ఎనర్జీ దొరుకుతాయి. వాటితోపాటు ట్యాలెంట్, చిలిపితనం కూడా పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలు తెలివిలోనూ దాన్ని బయటకు తెలపడంలోనూ రెండాకులు ఎక్కువే అనుకోవచ్చు. ఓ ఐదేళ్ళ బుడ్డిదాని లెక్కల హోమ్ వర్క్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

WhatsApp Image 2023-02-02 at 4.52.29 PM.jpeg

ఐదేళ్ళ పాప హోమ్ వర్క్ షీట్ ను ఆ పాప తండ్రి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కిండర్ గార్డెన్ స్కూల్లో చదువుతున్న ఆ పాపకు లెక్కల వర్క్ షీట్ లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో మూడు ప్రశ్నలుంటే రెండవ ప్రశ్నలో 'కింద ఇచ్చిన సంఖ్యల వరుసలో మిస్సయిన నెంబర్ ను రాయండి' అని అడిగారు. దానికి ఆ పాప సమాధానం రాసింది. అయితే దాని తరువాత ప్రశ్నకు ఆ పాప ఇ్చచిన సమాధానమే అందరినీ నవ్విస్తోంది. 'పైన రాసిన సంఖ్యల వరుసను ఎలా కనుక్కున్నావు?' అనేది ఆ ప్రశ్న. ఆ పాప దానికి సమాధానంగా (i am smart)ఎందుకంటే నేను స్మార్ట్ కాబట్టి అని రాసింది. దీన్ని చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. ఒకరైతే 'మీరు ఆ పేపర్ ను ఫ్రేమ్ కట్టించండి మీ పాప స్మార్ట్ ఆన్సర్ జ్ఞాపకంగా' అని అన్నారు. ఏది ఏమైనా ఈ స్మార్ట్ గర్ల్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-02-02T16:59:50+05:30 IST