Viral: బలవంతంగా ముద్దు పెట్టుకున్న ఓ యువకుడి పెదాలను కరకరా కొరికేసిన యువతి.. విషయం తెలిసి పోలీసులు ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2023-02-07T18:39:35+05:30 IST

తనను బలవంతం చేయబోయిన ఓ యువకుడి పెదాలు ఊడొచ్చేలా కొరికి అతడి నుంచి తప్పించుకుందో యువతి.

Viral:  బలవంతంగా ముద్దు పెట్టుకున్న ఓ యువకుడి పెదాలను కరకరా కొరికేసిన యువతి.. విషయం తెలిసి పోలీసులు ఏం చేశారంటే..

ఇంటర్నెట్ డెస్క్: తనను బలవంతం చేయబోయిన ఓ యువకుడి పెదాలు ఊడొచ్చేలా కొరికి(bites off lips) అతడి నుంచి తప్పించుకుందో యువతి. ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) మీరట్(Meerut) జిల్లాల్లో స్థానికంగా ఇది వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు శనివారం పొలంలో పని చేసుకుంటుండగా మోహిత్ శైనీ అనే యువకుడు ఆమెను వెనకు నుంచి వాటేసుకున్నాడు.

ఏం జరుగుతోందో అర్థంకాక భయభ్రాంతులకు లోనైన బాధితురాలిని బలవంతంగా పక్కకు తీసుకెళ్లాడు. ఆమె దుస్తులు చించి ముద్దుపెట్టేందుకు యత్నించగా.. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది. అతడి పెదాలను గట్టిగా కొరికేసింది. దీంతో.. అతడి నోటి నుంచి నెత్తురు ధారలై కారింది. బాధతో తట్టుకోలేక అతడు బాధితురాలిని విడిచిపెట్టగానే ఆమె పెద్ద పెట్టున కేకలు వేసింది.

యువతి అరుపులకు అప్రమత్తమైన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. వేధింపులకు పాల్పడటం, అత్యాచార యత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మోహిత్‌కు ఆ యువతి ముందే తెలుసా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-07T18:39:37+05:30 IST