'stuck' on moon: చంద్రుడిపై చిక్కుకుపోయానంటూ ట్వీట్.. ముంబై పోలీసుల స్పాంటేనియస్ రిప్లై!

ABN , First Publish Date - 2023-01-31T20:19:16+05:30 IST

సోషల్ మీడియా(Social Media)లో ఇవాళ రేపు పోలీసులు కూడా

 'stuck' on moon: చంద్రుడిపై చిక్కుకుపోయానంటూ ట్వీట్.. ముంబై పోలీసుల స్పాంటేనియస్ రిప్లై!

ముంబై: సోషల్ మీడియా(Social Media)లో ఇవాళ రేపు పోలీసులు కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు. వివిధ సమస్యలపై అవగాహన కల్పించేందుకు, సమస్యలపై తక్షణం స్పందించేందుకు సామాజిక మాధ్యమాలను పోలీసులు చక్కగా వినియోగించుకుంటున్నారు. అప్పుడప్పుడు యూజర్ల తలతిక్క ప్రశ్నలకు కూడా అదిరిపోయే సమాధానాలు ఇస్తూ ట్రెండ్ అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ఎలాంటి సంశయం అక్కర్లేకుండా నేరుగా డయల్ 100కు కాల్‌ చేయాలన్న ముంబై పోలీసుల(Mumbai Police) పోస్టుకు బీఎంఎస్ ఖాన్ అనే యూజర్ సరదా రిప్లై ఇచ్చాడు. చంద్రుడిపై ఉండి భూమిని చూస్తున్న వ్యోమగామి ఫొటోను షేర్ చేస్తూ.. తాను చంద్రుడిపై చిక్కుకుపోయానని పేర్కొన్నాడు. ఈ పోస్టుకు పోలీసులు స్పాంటేనియస్‌గా స్పందించారు. ఇది తమ పరిధి కానప్పటికీ, చంద్రుడిపై నుంచి భూమికి తీసుకురాగలమన్న నమ్మకాన్ని తమపై ఉంచినందుకు కృతజ్ఞతలని రిప్లై ఇచ్చారు.

దీంతో ఈ పోస్టు కాస్త వైరల్ అయింది. చాలామంది యూజర్లు పోలీసుల రిప్లైని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ‘అద్భుతమైన రెస్పాన్స్’ అని ఒకరంటే, ‘అత్యద్భుతం’ అని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఈ విషయంలో ముంబై పోలీసులను తలదన్నేవారే లేరని ఇంకో యూజర్ ప్రశంసించాడు. ట్విట్టర్‌లో ముంబై పోలీసుల తరపున రిప్లై ఎవరు ఇస్తున్నారో కానీ, అవి చదివాక వారికి ఫ్యాన్ అయిపోయానని మరొక యూజర్ పేర్కొన్నాడు. ఇలాంటి చమత్కారమైన రిప్లైలు ఇవ్వడం ముంబై పోలీసులకు కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి ఆకట్టుకునే రిప్లైలతో సోషల్ మీడియాను ఆకర్షించారు.

Updated Date - 2023-01-31T20:19:17+05:30 IST