మీ అమ్మాయి చనిపోయిందంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ చెప్పిన పక్కింటి వాళ్లు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-01-25T18:51:21+05:30 IST

హర్యానాలో (Haryana) ఓ మైనర్ బాలిక మృతికి మొబైల్ ఫోన్ కారణమైంది. తల్లిదండ్రులు కూలి పనుల కోసం బయటకు వెళ్లాక ఆ బాలిక ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు చూసి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మీ అమ్మాయి చనిపోయిందంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ చెప్పిన పక్కింటి వాళ్లు.. అసలేం జరిగిందంటే..

హర్యానాలో (Haryana) ఓ మైనర్ బాలిక మృతికి మొబైల్ ఫోన్ కారణమైంది. తల్లిదండ్రులు కూలి పనుల కోసం బయటకు వెళ్లాక ఆ బాలిక ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు చూసి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అడిగిన వెంటనే మొబైల్ కొనివ్వలేదనే కారణంతోనే ఆ బాలిక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. హర్యానాలోని ఝజ్జర్‌లో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (Crime News).

బీహార్ నుంచి వలస కూలీలుగా వచ్చిన ఓ కుటుంబం ఝజ్జర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. తల్లిదండ్రులిద్దరూ పగలు పని లోకి వెళ్లి రాత్రికి తిరిగి వస్తారు. 14 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఆ బాలిక కొన్ని రోజులుగా ఓ మొబైల్ ఫోన్ కొనివ్వమని తల్లిదండ్రులను అడుగుతుండేది. అయితే పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు డబ్బుల్లేక మొబైల్ ఫోన్ కొనలేకపోయారు. తల్లిదండ్రులపై అలిగిన కూతురు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది (Minor Girl commits suicide for Mobile Phone). విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు బాలిక కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గది తలుపులు పగలగొట్టి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మైనర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - 2023-01-25T18:51:21+05:30 IST