McDonald's robot servers: ఈ రెస్టారెంట్‌లో ఉద్యోగులు ఉండరు.. ఇలా అయితే ఎలా బతకాలి అంటూ నెటిజన్ల ఆవేదన..

ABN , First Publish Date - 2023-01-31T20:06:34+05:30 IST

ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. బడా బడా కంపెనీలన్నీ ఉద్యోగులను ఇళ్లకు పంపే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాయి. అయితే ఉద్యోగులను వేధిస్తోంది కేవలం ఆర్థిక మాంద్యం మాత్రమే.. యాంత్రీకరణ కూడా.

McDonald's robot servers: ఈ రెస్టారెంట్‌లో ఉద్యోగులు ఉండరు.. ఇలా అయితే ఎలా బతకాలి అంటూ నెటిజన్ల ఆవేదన..

ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. బడా బడా కంపెనీలన్నీ ఉద్యోగులను ఇళ్లకు పంపే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాయి. అయితే ఉద్యోగులను వేధిస్తోంది కేవలం ఆర్థిక మాంద్యం మాత్రమే.. యాంత్రీకరణ కూడా. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో అదే భయాన్ని కలిగిస్తోంది. టెక్సాస్‌లోని మెక్‌డోనాల్డ్స్ (McDonald's) సంస్థకు చెందిన అవుట్ లెట్‌కు సంబంధించిన వీడియో అది.

ప్రముఖ ఫుడ్‌ రెస్టారెంట్‌ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌ అమలు చేస్తున్న విధానం భవిష్యత్తులో ఉద్యోగుల పరిస్థితిని ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది. ఉద్యోగులతో పనిలేకుండా పూర్తిగా రోబోలతో నడిచే రెస్టారెంట్‌ను మెక్‌డొనాల్డ్స్‌ సంస్థ టెక్సాస్‌లో (Texas) ప్రారంభించింది. ఈ రెస్టారెంట్‌లో సర్వర్‌లు మొదలు, క్యాషియర్‌ వరకు అసలు ఉద్యోగి అనే వాడే ఉండడు. ఆహారం త‌యారుచేయ‌డం ద‌గ్గ‌ర నుంచి స‌ర్వ్ చేయ‌డం వ‌ర‌కూ అన్నీ రోబోలే చేసేస్తాయి. మెక్‌డొనాల్డ్స్ ప్ర‌యోగాత్మ‌కంగా ఈ రెస్టారెంట్‌ను ఓపెన్ చేసింది (Fully Automated Outlet).

ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ (Viral Video) అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొత్త టెక్నాలజీ సూపర్‌ అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం భవిష్యత్తులో ఉద్యోగుల (Human Workforce) పరిస్థితి ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆటోమేషన్ అనేది భవిష్యత్తులో ఎంతో మందికి తిండి లేకుండా చేస్తుందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-31T20:06:36+05:30 IST