ఒకప్పుడు ఉద్యోగ ప్రయత్నాలతో విసిగిపోయాడు.. ఇప్పుడు 25 మందికి ఉద్యోగాలిచ్చి నెలకు రూ.20 లక్షలు సంపాదిస్తున్నాడు..

ABN , First Publish Date - 2023-01-31T18:43:09+05:30 IST

పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఆ యువకుడు ఉన్నత చదువులు పూర్తి చేశాడు.. చదువు తర్వాత ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.. దీంతో తనకు ఉద్యోగం రాదని నిర్ణయించుకున్నాడు.. ఆ తర్వాత ఉద్యోగిగా కాకుండా ఉద్యోగ ప్రదాతగా ఉండాలని నిర్ణయించుకున్నాడు..

ఒకప్పుడు ఉద్యోగ ప్రయత్నాలతో విసిగిపోయాడు.. ఇప్పుడు 25 మందికి ఉద్యోగాలిచ్చి నెలకు రూ.20 లక్షలు సంపాదిస్తున్నాడు..

పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఆ యువకుడు ఉన్నత చదువులు పూర్తి చేశాడు.. చదువు తర్వాత ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.. దీంతో తనకు ఉద్యోగం రాదని నిర్ణయించుకున్నాడు.. ఆ తర్వాత ఉద్యోగిగా కాకుండా ఉద్యోగ ప్రదాతగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.. వ్యవసాయంలో విభిన్న పద్ధతులను ఆశ్రయించి విజయవంతమయ్యాడు.. ప్రస్తుతం 25 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు.. ఏడాదికి రూ.2 కోట్లకు పైగానే సంపాదిస్తున్నాడు.. మీర్జాపూర్‌కు చెందిన ఉదయ్ ప్రతాప్ విజయగాథ ఇది.

మీర్జాపూర్‌కు (Mirzapur) చెందిన ఉదయ్ మొరాదాబాద్ కాలేజీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడు. అయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో స్వయంగా పుట్ట గొడుగుల సాగు ప్రారంభించాడు. పుట్ట గొడుగుల ఉత్పత్తి, మార్కెటింగ్ గురించి క్షుణ్నంగా అధ్యయనం చేశాడు (Mushroom Cultivation). 25 మందిని ఉద్యోగులుగా నియమించుకున్నాడు. స్వయంగా వ్యవసాయ (Agriculture) కుటుంబం కావడంతో అతడికి భూమి ఉంది. దాంట్లోనే సాంప్రదాయేతర పద్ధతులను ఉపయోగించి పుట్టగొడుగుల సాగు మొదలుపెట్టాడు. ఏడాది పొడవునా పుట్టగొడుగుల పెంపకం చేయడానికి భిన్నమైన వ్యూహాన్ని పాటించాడు. వ్యవసాయ భూమిలో రెండు పెద్ద గదులను నిర్మించి ఒక్కొక్క దాంట్లో 5.5 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు స్ప్లిట్ ఏసీలు, 4 విండో ఏసీలు ఏర్పాటు చేశాడు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 17 లక్షల రుణం తీసుకున్నాడు. పుట్టగొడుగుల పెంపకం కంపోస్టులో జరుగుతుంది. ఆ కంపోస్టు 28 నుంచి 32 రోజుల్లో సిద్ధం అవుతుంది. విత్తనాలు వేసిన తర్వాత గదుల లోపల ఉష్ణోగ్రత 16 నుంచి 25 °C మధ్య ఉండేలా చూడాలి. ACలను ఉపయోగించి టెంపరేచర్ కంట్రోల్ చేస్తారు. అలా 45 రోజుల్లో పుట్టగొడుగులు అమ్మకానికి సిద్ధమవుతాయి. మొదట్లో ఉదయ్ మీర్జాపూర్‌లో మాత్రమే పుట్టగొడుగులను సరఫరా చేసేవాడు. క్రమంగా, ఉత్పత్తి పెంచి, వారణాసి, ప్రయాగ్‌రాజ్, సోన్‌భద్ర, చుట్టుపక్కల జిల్లాల మార్కెట్‌లకు కూడా పుట్టగొడుగులు పంపుతున్నాడు. ప్రస్తుతం నేపాల్‌కు కూడా పుట్టుగొడుగులను ఎగుమతి చేస్తున్నాడు. ఉత్పతి నుంచి మార్కెటింగ్ వరకు చూసుకునేందుకు అతడి దగ్గర మొత్తం పాతిక మంది పని చేస్తున్నారు. ఇలా ఉదయ్ ఏడాదికి రూ.2 కోట్లకు పైనే సంపాదిస్తున్నాడు.

Updated Date - 2023-01-31T18:43:10+05:30 IST