యాక్సిడెంట్ పరిహారం కోరుతూ యజమాని మీద 22కోట్ల దావా.. ఎలా దొరికిపోయాడంటే..

ABN , First Publish Date - 2023-02-01T16:26:56+05:30 IST

యజమాని మీద దావా వేసాడు కానీ ఆ తరువాత జరిగిన దానికి అతడే షాకయ్యాడు

యాక్సిడెంట్ పరిహారం కోరుతూ యజమాని మీద 22కోట్ల దావా.. ఎలా దొరికిపోయాడంటే..

'మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదం కారణంగా నేను చాలా నష్టపోయాను. ప్రస్తుతం నేను పనిచేయలేని స్థితిలో ఉన్నాను. కాబట్టి నాకు పరిహారంగా 22కోట్లు ఇవ్వండి' అంటూ యజమాని మీద దావా వేసాడు ఒక వ్యక్తి. అవాక్కయ్యేలా ఉన్న ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫిరెన్క్ సుమేగీ అనే వ్యక్తి, హీతో విమానాశ్రయంలో చెఫ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అతను పనిలో భాగంగా ఒక ట్రేని ఎత్తేటప్పుడు వీపు భాగంలో గాయమైంది. అయితే అతను మాత్రం ఆ గాయం వల్ల తన కాలులో భరించలేని నొప్పి వస్తోందని, నడవడానికి వాకింగ్ స్టిక్ ఉపయోగించాల్సి వస్తోందని చెప్పాడు. 'నాకున్న సమస్య వల్ల పదినిమిషాలు కూడా నిలబడలేకుండా ఉన్నాను. నేను ఉద్యోగం చేయలేను. నాకు పరిహారంగా 22కోట్లు ఇవ్వండి' అని యజమానిపై దావా వేసాడు. అక్కడి లాయర్ లు కూడా అతడు చెప్పింది నిజమేనేమో అనుకున్నారు. అతనికి నష్టపరిహారం ఇప్పించాలని నిర్ణయించుకున్నారు.

అయితే సుమేగి చేసిన ఓ చిన్న పొరపాటు అతడిది అంతా డ్రామా అనే విషయాన్ని బయటపెట్టింది. సుమేగి తన ఫ్యామిలితో కలసి హాలిడే ట్రిప్ కు వెళ్ళి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. ఆ ఫోటోస్ లో సుమేగి స్టిల్స్ చూస్తే అసలు అతను చెప్పిన సమస్య ఏది అతనికి ఉన్నట్టు అనిపించలేదు. నీళ్ళలోనూ, బీచ్ దగ్గర ఇసుకలోనూ మనోడు హీరో లెక్కన స్టిల్స్ ఇచ్చాడు. అతని మీద ఓ కన్నేసిన లాయర్ లు అతని ఫేస్ బుక్ చూసి అవాక్కయ్యారు. అలా అతని గుట్టు రట్టయింది. అతను యజమానిని డిమాండ్ చేసిన పరిహారం గురించి వదిలేస్తే, కోర్టు ఖర్చులు అయినందుకు అతడినే 75లక్షల రూపాయలు చెల్లించమని కోర్టు తీర్పు ఇచ్చింది.

Updated Date - 2023-02-01T16:27:05+05:30 IST