chanakya niti: మనిషిలోని ఆ ఒక్క గుణం అతనిని మహనీయునిగా మారుస్తుంది!

ABN , First Publish Date - 2023-02-06T07:01:35+05:30 IST

దేవుడు ప్రపంచంలోని ఒక్కొక్కరిని ఒక్కో విధంగా సృష్టించాడు. ప్రకృతిలో ఒకే రకంగా ఉండే వారు ఎవరూ ఉండరు. కొందరు కఠినంగా ఉంటారు. కొందరి స్వభావం ఎంతో మృదువుగా ఉంటుంది. కొందరికి ఎదుటివారు...

chanakya niti: మనిషిలోని ఆ ఒక్క గుణం అతనిని మహనీయునిగా మారుస్తుంది!

దేవుడు ప్రపంచంలోని ఒక్కొక్కరిని ఒక్కో విధంగా సృష్టించాడు. ప్రకృతిలో ఒకే రకంగా ఉండే వారు ఎవరూ ఉండరు. కొందరు కఠినంగా ఉంటారు. కొందరి స్వభావం ఎంతో మృదువుగా ఉంటుంది. కొందరికి ఎదుటివారు తాము అనుసరించే మార్గాన్నే అనుసరించాలని కోరుకునే అలవాటు ఉంటుంది. కొందరు తమకు జీవితంలో దక్కినదానితోనే సంతృప్తి చెందడం అలవాటు. అయితే మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలంటే అందరి అభిమానాన్ని పొందాలని ఆచార్య చాణక్యుడు అంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ దుఃఖాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎదురుకాదు.

అలాంటివారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. వారు ఎప్పుడూ నిరాశను ఎదుర్కోవలసిన అవసరం రాదు. ఆచార్య చాణక్యుడు తెలిపినదాని ప్రకారం వినయ స్వభావంతో మెలిగేవారు ఈ లోకాన్ని జయించగలరు. ఎలాంటి పదవినైనా సాధించగలరు. నిరాడంబర స్వభావం ఉన్న వ్యక్తిని అందరూ ఇష్టపడతారు. వారికి ఎవరి మనసునైనా గెలుచుకునే సత్తా ఉంటుంది. అతని వినయమే అతని గుర్తింపు. అలాంటివారి వినయ స్వభావం కారణంగా వారు ప్రతిచోటా గౌరవం పొందుతారు.

Updated Date - 2023-02-06T09:10:50+05:30 IST