Health: విటమిన్ బి12 మీకు ఎప్పుడు, ఎంత అవసరం? ఎవరికి ఎక్కువగా అవసరం? తెలుసుకోండిలా..

ABN , First Publish Date - 2023-04-15T19:32:13+05:30 IST

వైరల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా తమ విటమిన్ బి12 స్థాయిలు పడిపోయాయని చాలా మంది రోగులు భావిస్తుంటారు. ఇది నిజం కాదు. ఇన్‌ఫెక్షన్ రాకముందే వారిలో బి12 లోపం ఉందని గ్రహించరు. సాధారణంగా ఎవరూ తమ విటమిన్ లెవెల్స్ గురించి ..

Health: విటమిన్ బి12 మీకు ఎప్పుడు, ఎంత అవసరం? ఎవరికి ఎక్కువగా అవసరం? తెలుసుకోండిలా..

వైరల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా తమ విటమిన్ బి12 స్థాయిలు పడిపోయాయని చాలా మంది రోగులు భావిస్తుంటారు. ఇది నిజం కాదు. ఇన్‌ఫెక్షన్ రాకముందే వారిలో బి12 లోపం ఉందని గ్రహించరు. సాధారణంగా ఎవరూ తమ విటమిన్ లెవెల్స్ గురించి ప్రత్యేకంగా పరీక్షించుకోరు కూడా. ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు ఇవి మరింత తక్కువ స్థాయికి పడిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు.

చాలా మంది వైరల్ ఫీవర్ గానీ, ఫ్లూ, కోవిడ్ వంటి ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు తీవ్ర అలసటకు గురౌతుంటారు. దీనిని నుంచి కోలుకునేందకు బి12 విటమిన్ సప్లిమెంట్స్‌ను తీసుకుంటుంటారు. అయితే బి12 సప్లిమెంట్స్ తీసుకోవడం ఎల్లప్పుడు పనిచేయకపోవచ్చు. బి12 లెవెల్స్ తక్కువ స్థాయికి పడిపోయాయని టెస్టుల ద్వారా నిరూపతమైతే అప్పుడు సప్లిమెంట్స్ వాడవచ్చు. బి12 సాధారణ లోపాన్ని మనం తీసుకునే ఆహారం ద్వారా భర్తీ చేసుకోవచ్చు. బి12 సాధారణ స్థితిలో ఉంటే సప్లిమెంట్స్ పనిచేయవు.

విటమిన్ B 12 (కోబాలమిన్) ఎర్ర రక్త కణాలను ఏర్పరచడంలో, కణ జీవక్రియను నిర్వహించడంలోను, నాడీ పనితీరును సున్నితంగా ఉండేలా చేయడంలోనూ, DNAని జాగ్రత్తగా చూసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

విటమిన్ B12 లోపానికి చికిత్స చేయకుండా వదిలేస్తే.. రక్తహీనత, అలసట, కండరాల బలహీనత, ప్రేగు సంబంధిత సమస్యలు, శ్వాస ఆడకపోవడం, జుట్టు రాలడం, తలనొప్పి, వెన్నునొప్పి, నరాల దెబ్బతినడం, మానసిక స్థితి ఆటంకాలు, నిరాశ (ఇది సెరోటోనిన్‌ను ప్రభావితం చేస్తుంది కాబట్టి) మెదడు పొగమంచు, క్షీణత, మానసిక ఇబ్బందులకు దారితీస్తుంది. విటమిన్ B12 లోపం వల్ల హోమోసిస్టీన్ (అమినో యాసిడ్) లెవెల్స్ కూడా పెరుగుతాయి. దీంతో రక్తాన్ని చిక్కగా మార్చి గడ్డకట్టేలా చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే బి12 లోపం ప్రతి అవయవ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా తగినంత విటమిన్ B12ను పొందవచ్చు. మాంసం, చేపలు, పాలు ఉత్పత్తులలో బి12ను పుష్కలంగా లభిస్తాయి. కానీ మొక్కల ఆహారాలలో విటమిన్ B 12 ఉండదు. తృణధాన్యాలు వంటి బలవర్ధకమైన ఆహారంలో బి12 పుష్కలంగా ఉంటుంది.

బి12 ఎవరికి అవసరం, ఎంత అవసరం?

పెద్దలకు రోజువారీ మొత్తం 2.4 మైక్రోగ్రాముల B12 విటమిన్ అవసరముంటుంది. అయితే వాస్తవానికి, మన వయస్సు 60 సంవత్సరాల దాటిన తర్వాత, కడుపులో తక్కువ ఆమ్లాన్ని ఉత్పత్తి జరుగుతుంది. ఇది ఆహారం నుంచి విటమిన్ B12 ను తీయడం కష్టతరం చేస్తుంది. ఈ సమస్య శాఖాహారులు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా కలిగి ఉండవచ్చు. అందుకే వీరికి బి12 సప్లిమెంట్స్ అవసరం ఉంటుంది. ఈ లోపంతో బాధపడుతున్న 80శాతం భారతీయులలో అనారోగ్య సమస్యలు తలెత్తులున్నాయి.

విటమిన్ బి12 సప్లిమెంట్లను ఎలా అందించాలి?

సాధారణంగా, వైద్యులు ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నోటి ద్వారా తీసుకునే సప్లిమెంట్లను సూచిస్తారు. బి12 లెవెల్స్ మరీ తక్కువగా ఉంటే B12 ఇంజెక్షన్ అవసరం కావచ్చు. వారానికి రెండు చొప్పున ఐదు ఇంజక్షన్లు తీసుకోవడం ద్వారా బి12 లెవెల్స్‌ను సరిచేస్తారు.

కొన్నిసార్లు, రక్తహీనత కోసం ఇనుము స్థాయిలను మెరుగుపరచడానికి B12తో ఫోలిక్ ఆమ్లాన్ని సూచిస్తామని డాక్టర్లు చెబుతున్నారు. రోగనిరోధక పనితీరును పెంచడానికి ఈ కలయిక ఉత్తమంగా పనిచేస్తుందని, ఫోలిక్ యాసిడ్‌ను వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. డాక్టర్ డిస్క్రిప్షన్ లేకుండా ఫోలిక్ యాసిడ్ వాడితే దుష్పరిణామాలు ఉండే అవకాశం ఉంది.

విటమిన్ B12 లెవెల్స్ ఎలా చెక్ చేయాలి ?

ముఖ్యంగా 60 యేళ్లు పైబడిన వారు బి12 లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఎనిమియా, బి12 లోపం, హోమోసిస్టీన్, మిథైల్‌మెలోనిక్ యాసిద్(MMA)లను రక్తపరీక్షల ద్వారానే గుర్తిస్తారు. ఈ మూడింటిని నిర్ధారించడం ద్వారా బి12 లోపం ఉందని గుర్తించవచ్చు.

Updated Date - 2023-04-15T19:32:13+05:30 IST