అతడికి 62.. ఆమెకు 45 !

ABN , First Publish Date - 2023-01-26T08:22:49+05:30 IST

కన్నియాకుమారి జిల్లాలోని కుళచ్చల్‌లో 45 యేళ్ళ మహిళను 62 యేళ్ళ మత బోధకుడు అర్థరాత్రి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు...

అతడికి 62.. ఆమెకు 45 !

- మలేసియా మహిళను పెళ్ళాడిన మత బోధకుడు

అడయార్‌(చెన్నై), జనవరి 25: కన్నియాకుమారి జిల్లాలోని కుళచ్చల్‌లో 45 యేళ్ళ మహిళను 62 యేళ్ళ మత బోధకుడు అర్థరాత్రి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... కుళచ్చల్‌ సమీపంలోని పరుత్తివిలై ప్రాంతానికి చెందిన 62 యేళ్ళ మత ప్రబోధకుడు బ్రహ్మచారిగా జీవిస్తున్నాడు. ఈయన తన తల్లితో కలిసి ఉంటూ ఇంటింటికీ వెళ్ళి మత ప్రచారంతో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు 45 యేళ్ళ మలేసియాకు చెందిన ఓ మహిళతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారిద్దరు చాటింగ్‌ చేసుకుంటూ ప్రేమలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న ఆ మహిళ నాగర్‌కోయిల్‌(Nagercoil) వచ్చారు. స్థానిక చర్చిలో ఆమెను పెళ్ళి చేసుకున్న మత బోధకుడు ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆయన వైఖరిని తీవ్రంగా ఖండించారు. 62 యేళ్ళ వయస్సులో 45 యేళ్ళ మహిళను పెళ్ళి చేసుకోవడం ఏమిటంటూ ప్రశ్నించసాగారు. అయితే, మంగళవారం రాత్రి ఆయన బయటకు వెళ్ళగా, ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబీకులు ఇంటికి చేరుకుని ఆ మహిళను బంధించారు. ఆ తర్వాత ఆయన్ను కూడా ఇంటిలోకి వెళ్ళకుండా అడ్డుకున్నారు. దీంతో మత ప్రబోధకుడు 100 నంబరుకు ఫోన్‌ చేయగా, పోలీసులు వచ్చి రక్షించారు.

Updated Date - 2023-01-26T08:22:49+05:30 IST